Actor Govinda: బాలీవుడు నటుడు గోవిందాకు అస్వస్థత.. ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోవడంతో..
ABN , Publish Date - Nov 12 , 2025 | 09:05 AM
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆకస్మాత్తుగా తన నివాసంలో స్పృహతప్పి పడిపోయారు. ఈ క్రమంలో జుహులోని క్రిటికేర్ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబరు12 (ఆంధ్రజ్యోతి): బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా (Bollywood Senior Actor Govinda) అస్వస్థతకు గురయ్యారు. ఆయన నివాసంలో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. వారి ఇంటికి దగ్గరలోని క్రిటికేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో గోవిందా చికిత్స పొందుతున్నారు. తన వ్యక్తిగత వైద్యులు గోవిందాకు చికిత్స అందిస్తున్నారు. గోవిందా అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న బాలీవుడ్ నటులు సామాజిక మాధ్యమాల్లో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. గోవిందా సెట్‌లో చాలా సందడిగా ఉండేవారని గుర్తుచేసుకుంటున్నారు.
గోవిందా నిన్న అస్వస్థతకు గురయ్యారు: లలిత్ బిందాల్
నిన్న(మంగళవారం) రాత్రి ఇంట్లోనే గోవిందా అస్వస్థతకు గురయ్యారని ఆయన స్నేహితుడు, న్యాయ సలహాదారు లలిత్ బిందాల్ మీడియాకు తెలిపారు. ఆస్పత్రికి తరలించే ముందు కుటుంబ సభ్యులు.. గోవిందా వ్యక్తిగత వైద్యులకు ఫోన్ చేశారని తెలిపారు. గోవిందా ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున ఆస్పత్రిలో చేరారన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందొద్దని లలిత్ బిందాల్ సూచించారు.
గత ఏడాది గోవిందా కాలికి గాయం..
కాగా, గత ఏడాది అక్టోబరులో.. గోవిందా తన లైసెన్స్ తుపాకీని అల్మారాలో పెడుతుండగా.. ఒక్కసారిగా పేలిందని గోవిందా మేనేజర్ తెలిపారు. తుపాకీ పేలడంతో గోవిందా కాలికి గాయమైందని తెలిపారు. దీంతో చికిత్స నిమిత్తం జుహులోని గోవిందా ఇంటికి సమీపంలోని క్రిటికేర్ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి, కాలు నుంచి బుల్లెట్‌ను తొలగించారని తెలిపారు. అప్పట్లో గోవిందా.. కొన్ని రోజుల పాటు విశాంత్రి తీసుకున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారని గోవిందా మేనేజర్ గుర్తుచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్
ఢిల్లీ పేలుళ్ల ఘటన.. కీలక వ్యక్తి ఫొటో వెలుగులోకి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి