Share News

Bihar Assembly Elections 2025: నేటితో ముగియనున్న బీహార్ రెండో విడత ఎన్నికల ప్రచారం

ABN , Publish Date - Nov 09 , 2025 | 10:21 AM

బీహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇవాళ్టి(ఆదివారం)తో ముగియనుంది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఎం సహా పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. రెండో విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 121 స్థానాలకు తొలివిడత పోలింగ్ ముగిసింది.

Bihar Assembly Elections 2025: నేటితో ముగియనున్న బీహార్ రెండో విడత ఎన్నికల ప్రచారం
Bihar Assembly Elections 2025

బీహార్, నవంబర్ 9: దేశంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. బీహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇవాళ్టి(ఆదివారం)తో ముగియనుంది. చివరి రోజు ఎన్నికల ప్రచారం కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీహార్ రెండో విడత ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఎం సహా పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. రెండో విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 121 స్థానాలకు పోలింగ్ ముగిసింది. 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు వివేక్‌ జోషి, ఎస్‌ఎస్‌ సంధు.. ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు.


నవంబర్​ 6న బీహార్​ అసెంబ్లీ ఎన్నికల(Bihar Assembly Elections) తొలివిడత పోలింగ్​ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.13 శాతం పోలింగ్​ నమోదు అయ్యింది. మొదటి దశలో భాగంగా 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగగా.. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా బెగుసరాయ్‌ నియోజకవర్గంలో 59.82శాతం పోలింగ్ నమోదైంది. పాట్నాలో మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యల్పంగా 48.69శాతం పోలింగ్ రికార్డ్ అయింది.


సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 60.13 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తొలివిడత ఎన్నికల్లో బీహార్‌లోని 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో 1314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు. పట్నా, దర్భంగా, మాధేపురా, సహర్సా, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, సివాన్, సరన్, వైశాలి, సమస్తిపూర్, బెగుసరాయ్, లఖిసరాయ్, ముంగేర్, షేక్‌పురా, నలంద, బక్సర్, భోజ్‌పూర్‌ నియోజకవర్గాల్లో మొదటి దశలో ఓటింగ్ జరిగింది. దాదాపు 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


పట్నాలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన సతీమణి రబ్రీ దేవి, మహాగఠ్‌బంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌, ఆయన భార్య రాజశ్రీ యాదవ్‌, లాలూ కుమార్తెలు మీసా భారతి, రోహిణి ఆచార్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్‌ కుమార్‌ సిన్హా లఖిసరయ్‌లో ఓటు వేశారు. మరో కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ పట్నాలో ఓటు వేశారు.


ఇవి కూడా చదవండి:

బిహార్‌లో రోడ్డు పక్కన వీవీప్యాట్‌ స్లిప్పులు

అమ్మమ్మతో నిద్రిస్తున్న 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆపై అత్యాచారం..

Updated Date - Nov 09 , 2025 | 01:39 PM