Share News

No Helmet No Petrol Rule: కొత్త రూల్.. ఇకపై హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కొట్టరు..

ABN , Publish Date - Jul 31 , 2025 | 07:05 PM

హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపే వారికి.. ఏ పెట్రోల్ బంక్‌లోనూ పెట్రోల్ కొట్టకుండా కఠినమైన రూల్ తెచ్చారు. భోపాల్ జిల్లాలోని అన్ని పెట్రోల్, సీఎన్‌జీ పంపుల్లో ఈ రూల్ అమలుకానుంది.

No Helmet No Petrol Rule: కొత్త రూల్.. ఇకపై హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కొట్టరు..
No Helmet No Petrol Rule

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా రోడ్డు ప్రమాదాల్లో రైడర్లు హెల్మెట్ వాడటం వల్ల ప్రాణాలతో బయటపడుతున్నారు. అయితే, ప్రమాదం జరిగితే ప్రాణాలు పోతాయని తెలిసినా కొంతమంది హెల్మెట్‌లు వాడటం లేదు. ఫైన్లు వేసినా, కౌన్సిలింగ్‌లు ఇచ్చినా జనాల్లో మార్పు రావటం లేదు. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారే తప్ప.. హెల్మెట్‌లు మాత్రం వాడటం లేదు. ఈ నేపథ్యంలోనే భోపాల్ జిల్లా కలెక్టర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.


హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపే వారికి.. ఏ పెట్రోల్ బంక్‌లోనూ పెట్రోల్ కొట్టకుండా కఠినమైన రూల్ తెచ్చారు. భోపాల్ జిల్లాలోని అన్ని పెట్రోల్, సీఎన్‌జీ పంపుల్లో ఈ రూల్ అమలుకానుంది. జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక ఓ బలమైన కారణం ఉంది. ఈ మధ్య కాలంలో ప్రమాదాలకు గురై.. హెల్మెట్ లేకుండా ప్రాణాలు పోగొట్టుకున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ ‘నో హెల్మెట్, నో పెట్రోల్ రూల్‌’ను తెరపైకి తెచ్చారు.


ఈ రూల్ అతిక్రమించిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 కింద వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కొత్త రూల్ ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ రూల్ కారణంగానైనా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వేసుకోవడాన్ని అలవాటు చేసుకుంటారని అధికారులు భావిస్తున్నారు. మరి, ఈ రూల్ వల్ల ప్రజలు మారతారా? లేక ప్రజల వల్ల రూలే లేకుండా పోతుందా? అన్నది వేచి చూడాలి.


ఇవి కూడా చదవండి

నోయల్‌కు ఇండియాలో చేదు అనుభవం.. లాక్కెళ్లిన పోలీసులు..

తల్లికి చివరి మెసేజ్.. అమ్మా నన్ను వీళ్లే చంపేస్తారు..

Updated Date - Jul 31 , 2025 | 07:50 PM