Share News

Reels: రీల్స్ చేస్తుండగా అనుకోని విషాదం.. పాపం యువతి..

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:42 PM

Bengaluru Woman: నందిని చనిపోవడంతో భయపడిపోయిన ముగ్గురు స్నేహితులు అక్కడినుంచి పారిపోయారు. బిల్డింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చారు. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Reels: రీల్స్ చేస్తుండగా అనుకోని విషాదం.. పాపం యువతి..
Bengaluru Woman

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలన్న పిచ్చితో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. ఇన్‌స్టా రీల్స్ చేసే క్రమంలో యువత పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతోంది. తాజాగా, నిర్మాణంలో ఉన్న భవనంలో రీల్స్ చేసే క్రమంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. పైనుంచి కింద పడి చనిపోయింది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన 20 ఏళ్ల నందిని ఓ హైపర్ మార్కెట్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోంది.


నందిని తన ముగ్గురు స్నేహితులతో( ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు) కలిసి సౌత్ బెంగళూరు, పరప్పన అగ్రహారలోని నిర్మాణంలో ఉన్న 13 అంతస్తుల భవనంలోకి వెళ్లింది. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత నలుగురి మధ్య రిలేషన్ విషయంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే విషాదకరమైన రీల్ చిత్రీకరించడానికి నందిని బిల్డింగ్ టెర్రస్ మీదకు వెళ్లింది. అక్కడ రీల్ చిత్రీకరిస్తూ ఉన్న సమయంలో లిఫ్ట్ ఏర్పాటు చేసే హోల్‌లో పడి పోయింది. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయింది.


నందిని చనిపోవడంతో ముగ్గురు స్నేహితులు భయంతో అక్కడినుంచి పారిపోయారు. బిల్డింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చారు. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరా దృశ్యాలను చెక్ చేయగా.. నందిని స్నేహితురాలి గురించి తెలిసింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు మాత్రం మరింత లోతుగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఒట్టి చేతులతో చిరుతపులితో పోరాటం..

మంగళసూత్రం నుండి గాజుల వరకు.. స్త్రీల ఆభరణాల వెనుక ఆరోగ్య రహస్యాలు ఇవే..

Updated Date - Jun 26 , 2025 | 05:34 PM