Share News

Bengaluru Road Rage Incident: బైకర్‌తో ఘర్షణ.. బెంగళూరులో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌పై హత్యాయత్నం కేసు

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:22 PM

బెంగళూరులో నిన్న బైకర్, ఎయిర్‌ఫోర్స్ అధికారి పరస్పర దాడి ఘటన కీలక మలుపు తిరిగింది. బైకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎయిర్‌ఫోర్స్ అధికారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

Bengaluru Road Rage Incident: బైకర్‌తో ఘర్షణ.. బెంగళూరులో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌పై హత్యాయత్నం కేసు
Bengaluru road rage case

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో బైకర్, ఎయిర్‌ఫోర్స్ అధికారి మధ్య ఘర్షణ కీలక మలుపు తిరిగింది. బైకర్ వికాస్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ శీలాదిత్య బోస్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీల్లో తొలుత రెచ్చిపోయింది ఎయిర్‌ఫోర్స్ అధికారే అన్నట్టు ఉండటం ఘటనను మరో మలుపు తిప్పింది.

ఏప్రిల్ 21న శీలాదిత్య తన భార్యతో కలిసి కారులో వెళుతున్న సందర్భంగా బైకర్‌ వికాస్‌తో వివాదం తలెత్తింది. చివరకు ఇద్దరూ బాహాబాహీకి దిగే వరకూ వెళ్లింది. తన కారుపై డీ‌ఆర్‌డీఓ స్టిక్కర్ ఉండటం చూసి వికాస్ రెచ్చిపోయిన వికాస్ రాయితో దాడి చేశాడని శీలాదిత్య తొలుత వీడియో పోస్టు చేశారు. కన్నడలో ఇష్టారీతిన దుర్భాషలాడారని అన్నాడు. ముఖంపై రక్తం చారలతో ఉన్న ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. తాము కన్నడిగులం కానందుకే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. ఘటన సమయంలో కారు నడుపుతున్న శీలాదిత్య భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అనంతరం, వైరల్ అయిన పలు వీడియోల్లో శీలాదిత్య, వికాస్ ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నట్టు కనిపించింది. ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు ఇది కన్నడిగులు, కన్నడేతరుల మధ్య జరిగిన ఘర్షణ కాదని అన్నారు. రోడ్ రేజ్ ఘటన అని స్పష్టం చేశారు.

మరోవైపు, వికాస్ కుమార్ తాజాగా బయ్యప్పనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎయిర్ ఫోర్స్ అధికారి కారే తొలుత తనకు అడ్డంగా వచ్చిందని అన్నారు. బోస్ తన కాలర్ల పట్టుకుని చెంప పగల గొట్టాడని, చేయి చేసుకున్నాడని అన్నాడు. బైక్‌పై ఉన్న తనకు కారు తగలడంతో వారిని ప్రశ్నించానని అన్నాడు. అధికారే తొలుత దాడికి దిగారని అన్నారు.


కాగా, ఘటనపై సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు ప్రత్యక్ష సాక్షులను కూడా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ దాడికి సంబంధించి సోషల్ మీడియా వీడియోలు వైరల్ అవుతున్నాయి. జనాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

బెంగళూరులో బైకర్, ఎయిర్‌ఫోర్స్ అధికారి మధ్య ఘర్షణ.. కేసులో ఊహించని ట్విస్ట్

ఇప్పటికే మాపై విమర్శలు.. తొలిసారిగా స్పందించిన సుప్రీం కోర్టు

పాడుబడ్డ ఇంట్లో అనాథ చిన్నారి.. కాపాడిన నటి దిశా పటానీ సొదరి

Read Latest and National News

Updated Date - Apr 22 , 2025 | 12:29 PM