Share News

Chicken Rice Scheme: వీధి కుక్కలకు మహర్దశ.. 2 కోట్లతో కొత్త స్కీమ్..

ABN , Publish Date - Jul 12 , 2025 | 10:47 AM

Chicken Rice Scheme: దేశంలో ఆరు కోట్లకుపైగా వీధి కుక్కలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. వీధి కుక్కల కారణంగా ప్రజలకు రక్షణ లేకుండా పోయింది.

Chicken Rice Scheme: వీధి కుక్కలకు మహర్దశ..  2 కోట్లతో కొత్త స్కీమ్..
Chicken Rice Scheme

బెంగళూరులోని వీధి కుక్కలకు మహర్దశ పట్టింది. ‘ది బృహత్ బెంగళూరు మహానగర పాలికే’ (BBMP) వాటి కోసం ఓ అద్భుతమైన స్కీమ్ తీసుకువచ్చింది. ‘చికెన్ రైస్ స్కీమ్’లో భాగంగా కుక్కలకు ప్రతీ రోజూ చికెన్ రైస్ పెట్టనుంది. బెంగళూరులో ప్రస్తుతం 5 వేల వీధి కుక్కలు ఉన్నాయి. బీబీఎమ్‌పీ ఒక్కో కుక్క కోసం ప్రతీ రోజూ 22 రూపాయలు ఖర్చు చేయనుంది. 367 గ్రాముల ఆహారాన్ని అందించనుంది. ఇందుకోసం సంవత్సరానికి 2.88 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.


వీధి జంతువుల సంరక్షణలో ప్రజల్ని భాగం చేయడానికి బీబీఎమ్‌పీ ‘కుక్కిర్ తీహార్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగానే చికెన్ రైస్ స్కీమ్ చేపట్టింది. బీబీఎమ్‌పీలోని మొత్తం 8 జోన్లు.. ఈస్ట్, వెస్ట్, సౌత్, ఆర్ఆర్ నగర్, దాసరహళ్లి, బొమ్మనహళ్లి, యళహంక, మహాదేవపురంలలోని కుక్కలకు ఆహారాన్ని పంపిణీ చేయనుంది. బీబీఎమ్‌పీ ఈ స్కీమ్‌ను అమలు చేయడానికి.. ప్రతీ జోన్‌కు ఏటా 36 లక్షల రూపాయలు కేటాయించనుంది.


స్కీముపై విమర్శలు..

దేశంలో ఆరు కోట్లకుపైగా వీధి కుక్కలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. వీధి కుక్కల కారణంగా ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో బీబీఎమ్‌పీ వీధి కుక్కల కోసం ‘చికెన్ రైస్ స్కీమ్’ అమలు చేయటంపై కాంగ్రెస్ ఎంపీ చిదంబరం మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘వీధి కుక్కలకు వీధుల్లో చోటు లేదు. వాటిని షెల్టర్లకు పంపాలి. అక్కడే వాటికి ఆహారం ఇవ్వాలి. వాక్సిన్లు వేయించాలి. వీధుల్లో వాటికి భోజనం పెట్టడం ఆరోగ్యం పరంగా.. ప్రజల రక్షణ పరంగా మంచిది కాదు’ అని అన్నారు. వీధి కుక్కల సంతతి పెరగటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన గతంలో ప్రధాని నరేంద్ర మోదీని సైతం కలిశారు.


ఇవి కూడా చదవండి

ఒక్కసారిగా కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద జనం..

వీడు మామూలోడు కాదు.. ఆడవేషంలో 1000 మంది మగాళ్లను..

Updated Date - Jul 12 , 2025 | 11:00 AM