Bomb Blasts In Dhaka: మాజీ ప్రధాని హసీనా కేసుపై తీర్పు.. ఢాకాలో హింసాత్మక ఘటనలు..
ABN , Publish Date - Nov 17 , 2025 | 08:50 AM
2024 మారణహోమం కేసుకు సంబంధించి ఇంటర్ నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కేసులో తుది తీర్పును ఈ రోజు (సోమవారం) వెలువరించనుంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు ఎక్కువైపోయాయి.
బంగ్లాదేశ్ వరుస నాటు బాంబు దాడులతో దద్దరిల్లుతోంది. దేశ రాజధాని ఢాకాలో నిన్న (ఆదివారం) పలుచోట్ల నాటు బాంబు దాడులు జరిగాయి. రాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు బాంబు దాడులకు పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్‌లోకి నాటు బాంబు విసిరారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ అధికారి ఇంటి బయట కూడా నాటు బాంబులు వేశారు. ఇంటర్ నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కేసులో తుది తీర్పును ఈ రోజు (సోమవారం) వెలువరించనుంది.
ఈ నేపథ్యంలోనే గత కొద్దిరోజుల నుంచి ఢాకాలో హింసాత్మక ఘటనలు ఎక్కువైపోయాయి. నవంబర్ 10వ తేదీన కూడా వరుస నాటు బాంబు దాడులు జరిగాయి. మీర్పూర్‌లోని గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వాటర్స్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. గ్రామీణ బ్యాంక్‌కు చెందిన చాలా బ్రాంచ్‌లపై కూడా పెట్రోల్ బాంబు దాడులు జరిగాయి. గత వారం పెద్ద సంఖ్యలో బస్సులను సైతం దుండగులు తగలబెట్టారు. ఓ బస్సులో నిద్రిస్తున్న డ్రైవర్ చనిపోయాడు. మాజీ ప్రధాని హసీనాకు మరణ శిక్ష విధిస్తారనే ప్రచారం బాగా జరుగుతోంది.
హసీనా కొడుకు సజీబ్ వాజెద్ తన తల్లికి మరణ శిక్ష విధించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. యూనస్ ప్రభుత్వం తన తల్లిని టార్గెట్ చేసిందని, దోషిగా తేల్చబోతోందని అన్నాడు. 2024 మారణహోమం కేసుకు సంబంధించి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు హోమ్ మినిస్టర్ అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ పోలీస్ చీఫ్ అబ్దుల్ అల్ మామూన్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. షేక్ హసీనా, అసదుజ్జమాన్ ఖాన్ కమల్ బంగ్లాదేశ్‌లో లేరు. అప్రూవల్‌గా మారిన అబ్దుల్ ఒక్కరే విచారణకు హాజరుకానున్నారు.
ఇవి కూడా చదవండి
శీతాకాలంలో ఆరోగ్యంగా ఉంచే 4 అలవాట్లు .!
పిచ్చి పీక్స్.. ఇండియాలో మొదటి జాంబీ మ్యాన్ ఇతనే..