Amul Milk: అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెంపు
ABN , Publish Date - Apr 30 , 2025 | 09:03 PM
అమూల్ స్టాండర్డ్, అమూల్ బఫెలో మిల్క్, అమూల్ గోల్డ్, అమూల్ స్లిమ్ ఎన్ ట్రిమ్, అమూల్ ఛాయ్ మజా, అమూల్ తాజా, అమూల్ కౌ మిల్క్ ధరలను లీటరుకు రూ.2 చొప్పన పెంచారు.

న్యూఢిల్లీ: అమూల్ పాల (Amul milk) ధరను సవరించారు. అమూల్ స్టాండర్డ్, అమూల్ బఫెలో మిల్క్, అమూల్ గోల్డ్, అమూల్ స్లిమ్ ఎన్ ట్రిమ్, అమూల్ ఛాయ్ మజా, అమూల్ తాజా, అమూల్ కౌ మిల్క్ ధరలను లీటరుకు రూ.2 చొప్పన పెంచారు. 2025 మే 1వ తేదీ ఉదయం నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) బుధవారంనాడు ప్రకటించింది.
India's gold demand: బంగారమంటే భయపడుతున్నారు
మదర్ డెయిరీ సైతం..
మదర్ డెయిరీ సైతం పాల ధరలను మంగళవారంనాడు పెంచింది. అన్ని రకాల ఉత్పత్తులపై రూ.2 మేర ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 30వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. గత కొద్ది నెలల్లో పాల సేకరణ ఖర్చు లీటరుకు రూ.4 నుంచి రూ.5కు పెరిగినట్టు తెలిపింది. కాగా, కొత్తగా సవరించిన ధరలు ప్రకారం బల్క్ వెండెడ్ మిల్క్ (టోన్డ్) ధర రూ.54 నుంచి రూ.56కు, ఫుల్ క్రీమ్ మిల్క్ ధర రూ.69కి పెరిగింది. ఆవుపాల ధర లీటరుకు రూ.57కు, డబుల్ టోన్డ్ పాల ధర లీటరు రూ.51కి చేరింది.
ఇవి కూడా చదవండి..