AK 203 Rifle: ఆర్మీ చేతికి ఏకే 203.. నిమిషానికి 700 రౌండ్లు..
ABN , Publish Date - Jul 18 , 2025 | 01:59 PM
AK 203 Rifle: ఏకే 47, ఏకే 56 గన్నుల కంటే ఏకే 203 గన్నులు ఎంతో అధునాతనమైనవి. ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్ రీఫైల్స్(INSAS)ను ఏకే 203 గన్నులు రీప్లేస్ చేయనున్నాయి.

గన్నుల్లో ఏకే 47లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 70 ఏళ్ల క్రితం తయారైన ఈ ఆటోమేటిక్ రైఫిల్ ఇప్పటికీ టాప్ పొజిషన్‌లో ఉంది. ప్రపంచం నలుమూలల ఉన్న అన్ని దేశాల ఆర్మీలు ఏకే 47ను వాడుతున్నాయి. అయితే, ఇండియన్ ఆర్మీ ఏకే 47లకు స్వప్తి చెప్పే సమయం వచ్చింది. ది ఇండో - రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకే 203 మిషిన్ గన్నులను తయారు చేసింది. ఉత్తర ప్రదేశ్, అమేథిలో తయారు అయిన వాటికి ‘శేర్’ అని పేరు పెట్టారు.
సదరు కంపెనీ 5,200 కోట్ల కాంట్రాక్ట్ కింద సాయుధ బలగాలకు ఆరు లక్షల గన్నులను సరఫరా చేయనుంది. ఈ విషయంపై IRRPL చీఫ్ మేజర్ జనరల్ ఎస్‌కే శర్మ గురువారం మాట్లాడుతూ.. ‘ది ఇండో - రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో 5,200 కోట్ల ఒప్పందం జరిగింది. ఆ కంపెనీ ఆరు లక్షల గన్నులను సప్లై చేస్తుంది. 2030 డిసెంబర్ నాటికి గన్నుల సప్లై పూర్తి చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు 48 వేల గన్నులు డెలివరీ అయ్యాయి. మరో రెండు, మూడు వారాల్లో మరో 7 వేల గన్నులు సరఫరా అవుతాయి. ఈ డిసెంబర్ నాటికి 15 వేల గన్నులు డెలివరీ అవుతాయి’ అని అన్నారు.
AK-203 ‘షేర్’ రైఫిల్ విశేషాలు
ఏకే 47, ఏకే 56 గన్నుల కంటే ఏకే 203 గన్నులు ఎంతో అధునాతనమైనవి. ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్ రీఫైల్స్(INSAS)ను ఏకే 203 గన్నులు రీప్లేస్ చేయనున్నాయి. ఇన్‌సాస్‌లో 5.56x45 ఎమ్ఎమ్ క్యాడ్‌రిజ్ ఉంటే.. ఏకే 203లో 7.62x39 ఎమ్ఎమ్ క్యాడ్‌రిజ్ ఉంటుంది. ఏకే 203 మ్యాగజైన్‌లో 30 క్యాడ్‌రిజ్‌లు పెట్టుకోవచ్చు. ఇన్‌సాస్ బరువు 4.15కేజీలు ఉంటే.. ఏకే 203 గన్నుల బరువు 3.8 కేజీలు మాత్రమే ఉంటుంది. పొడవు విషయానికి వస్తే.. బట్ స్టాక్ లేకుండా 705 మిల్లీ మీటర్లు ఉంటాయి. ఈ గన్నుల రేంజ్ 800 మీటర్లు. వీటిని ఎల్‌ఓసీ, ఎల్‌ఓఏసీతో పాటు మిగితా సరిహద్దు ప్రాంతాల్లోని సైనికులు వాడనున్నారు.
ఇవి కూడా చదవండి
నమ్మ మెట్రోలో స్మార్ట్ సేవలు.. 70 శాతం విభాగాల్లో ఆధునికీకరణ
అరుదైన వీడియో.. చిరుతపులులతో బ్లాక్ ప్యాంథర్ స్నేహం