9 Year Old Girl Tragedy: ఊహించని విషాదం.. 9 ఏళ్ల బాలికకు గుండెపోటు..
ABN , Publish Date - Jul 17 , 2025 | 09:10 AM
9 Year Old Girl Tragedy: ఇది గుర్తించిన స్కూలు సిబ్బంది పాపను వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. శిఖర్‌లోని ఆస్పత్రికి రెఫర్ చేశారు. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని శిఖర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేస్తుండగా పాప చనిపోయింది.

ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగిపోయాయి. ముందెన్నడూ లేని విధంగా.. వయసుతో సంబంధం లేకుండా జనాల్ని బలితీసుకుంటున్నాయి. దేశం ఈ మూలనుంచి ఆ మూల వరకు తరచుగా గుండెపోటు మరణాలు నమోదు అవుతున్నాయి. తాజాగా, ఓ తొమ్మిది సంవత్సరాల పాప గుండెపోటుతో కన్నుమూసింది. మధ్యాహ్నం భోజనం చేయడానికి టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసిన మరుక్షణమే ఆ చిన్నారి చనిపోయింది. ఈ విషాద సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్, దంత టౌన్‌కు చెందిన ప్రాచీ కుమావత్ అనే 9 ఏళ్ల చిన్నారి 4వ తరగతి చదువుతూ ఉంది. పాప ఎంతో ఆరోగ్యంగా.. చురుగ్గా ఉండేది. ఆడుతూ, పాడుతూ స్కూలు వెళ్లి వచ్చేది. రోజూ లాగే మంగళవారం కూడా స్కూలు స్కూలుకు వెళ్లింది. మధ్యాహ్నం వరకు ఎంతో ఆరోగ్యంగా ఉంది. భోజన విరామం సమయంలో భోజనం చేయడానికి టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసింది. ఆ వెంటనే నేలపై కుప్పకూలిపోయింది.
ఇది గుర్తించిన స్కూలు సిబ్బంది పాపను వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. శిఖర్‌లోని ఆస్పత్రికి రెఫర్ చేశారు. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని శిఖర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేస్తుండగా పాప చనిపోయింది. దీంతో కన్నవారి గుండె ఒక్కసారిగా బద్ధలైంది. కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రాచీ మృతిపై డాక్టర్ వర్మ మాట్లాడుతూ.. ‘మా సాయశక్తులా ప్రయత్నించాం.అయినా లాభం లేకపోయింది.
అందుకే శిఖర్‌లోని ఆస్పత్రికి రెఫర్ చేశాం. గుండె పోటు వచ్చిన వారిని ఆస్పత్రికి తీసుకురావటంలో ఆలస్యం అయితే.. వెంటనే సీపీఆర్ ఇవ్వాలి. చిన్న పిల్లలకు గుండెపోటు రావటం చాలా అరుదైన సంఘటన. పాప ఏ రకమైన గుండెపోటు వచ్చిందో దర్యాప్తు చెయ్యాలి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
గర్ల్‌ఫ్రెండ్‌ను ఎత్తుకుని హాస్పిటల్‌కు తీసుకొచ్చిన యువకుడు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే..
చిన్న పిల్లలకు వంటింటి చిట్కా.. ఎంత ప్రమాదకరం అంటే..