Share News

Padma Awards: 71 మందికి పద్మ పురస్కారాల అందజేత

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:40 AM

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ప్రముఖ వైద్యుడు దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి, సినీనటుడు నందమూరి బాలకృష్ణతో సహా 71 మందికి పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేశారు.

Padma Awards:  71 మందికి పద్మ పురస్కారాల అందజేత

నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్‌.. బాలయ్యకు పద్మభూషణ్‌

రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రదానం

పురస్కారాలు అందుకున్న నలుగురు తెలుగువారు

మాడుగుల నాగఫణిశర్మ, అప్పారావుకు పద్మశ్రీ

రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం.. పురస్కారాలు అందుకున్న నలుగురు తెలుగువారు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): పద్మ పురస్కారాల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో కనులవిందుగా జరిగింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 139 మందికి పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వారిలో 71 మందికి సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలను ప్రదానం చేశారు. మిగిలిన వారికి త్వరలోనే అందజేయనున్నారు. ప్రముఖ వైద్యుడు దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి పద్మవిభూషణ్‌, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్‌ పురస్కారాలను అందుకోగా.. సహస్రావఽధాని మాడుగుల నాగఫణిశర్మ, కళారంగంలో మిరియాల అప్పారావు పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించారు. మొత్తం ఏడుగురు తెలుగువారికి ఈ ఏడాది పద్మ పురస్కారాలు లభించగా వారిలో తొలివిడత నలుగురు అవార్డులను అందుకున్నారు.

fg.jpg

ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ సినీనటుడు, రాజకీయనాయకుడిగా బాలకృష్ణను ప్రశంసాపత్రంలో పేర్కొనగా.. డి.నాగేశ్వర్‌రెడ్డిని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు అని, వైద్య పరిశోధనలో అనేక విజయాలు సాధించిన వైద్యుడు అని కొనియాడారు.


ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు, బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నందమూరి కుటుంబ సభ్యులు, పలువురు అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులతో అశోకా హాలు కళకళలాడింది. బాలకృష్ణ పద్మభూషణ్‌ పురస్కారాన్ని స్వీకరిస్తుండగా ఆయన సతీమణి వసుంధర, సోదరి నారా భువనేశ్వరి, ఏపీ మంత్రి లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి, ఎంపీ భరత్‌, ఆయన సతీమణి తిలకించారు. పురస్కారాలు అందుకున్న వారిలో సినీనటులు శేఖర్‌ కపూర్‌, అజిత్‌ కుమార్‌ ఉన్నారు. సుజుకి కంపెనీ అధినేత ఒసాము సుజుకి, ప్రముఖ గాయకుడు పంకజ్‌ ఉదాస్‌, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్‌ మోదీ, ప్రముఖ మలయాళీ రచయిత వాసుదేవన్‌ నాయర్‌ దివంగతులైనందువల్ల వారి కుటుంబ సభ్యులు పురస్కారాలను స్వీకరించారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

For National News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 05:31 AM