Share News

16 Day Old Nephew: పెళ్లి కావట్లేదని యువతుల దారుణం.. 16 రోజుల చిన్నారి బలి..

ABN , Publish Date - Nov 16 , 2025 | 09:18 AM

నలుగురు అక్కా చెల్లెళ్లు అత్యంత దారుణమైన పని చేశారు. తమకు పెళ్లిళ్లు కావటం లేదన్న అసహనంలో మూఢనమ్మకాలను ఆశ్రయించారు. 16 రోజుల చిన్నారిని పాశవికంగా తొక్కి చంపేశారు.

16 Day Old Nephew: పెళ్లి కావట్లేదని యువతుల దారుణం.. 16 రోజుల చిన్నారి బలి..
16 Day Old Nephew

రాజస్థాన్‌ రాష్ట్రంలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి కోసం నలుగురు యువతులు ఘాతుకానికి ఒడిగట్టారు. 16 నెలల చిన్నారిని బలి తీసుకున్నారు. పసికందును చంపితే తమకు పెళ్లి అవుతుందన్న మూఢనమ్మకంతో ఈ దారుణమైన పని చేశారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జోధ్‌పూర్‌కు చెందిన నలుగురు యువతులు గత కొన్నేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినా ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు. ఏళ్లు గడుస్తుండటంతో నలుగురు అక్కాచెల్లెళ్లలో అసహనం పెరిగిపోయింది.


ఈ నేపథ్యంలోనే వారికి బావ వరుసయ్యే వ్యక్తికి సంవత్సరం క్రితం పెళ్లయింది. 16 రోజుల క్రితం కొడుకు పుట్టాడు. ఆ బాబును భెరు దేవుడికి బలి ఇస్తే తమకు పెళ్లి అవుతుందని వారు భావించారు. నలుగురు కలిసి బాలుడ్ని తమ రూములోకి తీసుకెళ్లారు. కాళ్లతో పిల్లాడిని తొక్కి చంపేశారు. తర్వాత క్షుద్ర పూజలు మొదలెట్టారు. ఓ యువతి తన ఒడిలో బాబు శవాన్ని పెట్టుకుని మంత్రాలను చదువుతూ ఉంటే.. మిగిలిన వాళ్లు కింద కూర్చుని మంత్రాలు చదవసాగారు.


ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో ఎవరు తీశారు? ఈ సంఘటన ఎలా బయటకు వచ్చిందన్నది తెలియరాలేదు. పోలీసులు నలుగురు యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై బాలుడి తండ్రి మాట్లాడుతూ.. ‘నా మరదళ్లు నా కొడుకును చంపేశారు. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కావటం లేదని వాళ్లు అల్లాడిపోతున్నారు. నా కొడుకును చంపితే మంచి మంచి సంబంధాలు వస్తాయని భావించారు. వాళ్లను కఠినంగా శిక్షించాలి’ అని పోలీసులను కోరాడు.


ఇవి కూడా చదవండి

సీఐఐ సదస్సు సూపర్ హిట్.. కూటమి ప్రభుత్వంపై మన్నవ మోహనకృష్ణ ప్రశంసలు..

షాకింగ్ .. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లు బంద్..

Updated Date - Nov 16 , 2025 | 09:48 AM