Share News

Odisha Brothers: బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:09 PM

Odisha Brothers: పోలీసులు ఆమెకు జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు అన్నదమ్ముల్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న తులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Odisha Brothers: బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
Odisha Brothers

ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారి కారణంగా గర్భం దాల్చిన బాలికను చంపడానికి ప్రయత్నించారు. బతికుండగానే పాతిపెట్టడానికి చూశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. భుబనేశ్వర్‌, బనాష్‌దార గ్రామానికి చెందిన భాగ్యధర్ దాస్, పంచానన్ దాస్ అన్నదమ్ములు. వీరు మరో వ్యక్తి తులుతో కలిసి అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై అత్యచారానికి ఒడిగట్టారు. తరచుగా బాలికపై అత్యాచారం చేశారు


ఈ నేపథ్యంలోనే బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం ఆ ముగ్గురు వ్యక్తులకు తెలిసింది. ఆమెను చంపడానికి ప్లాన్ చేశారు. గర్భం తీయించుకోవడానికి డబ్బులు ఇస్తామని నమ్మించి బాలికను ఓ చోటుకు రప్పించారు. ఆమె వాళ్లు చెప్పిన చోటుకు వెళ్లగా.. అక్కడ గొయ్యి తీసి ఉంది. అబార్షన్ చేయించుకోకపోతే.. బతికుండగానే పాతిపెడతామని ఆ యువకులు బాలికను బెదిరించారు. బాలిక అక్కడినుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది. తండ్రి బాలికను తీసుకుని స్టేషన్‌కు వెళ్లాడు.


పోలీసులు ఆమెకు జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు అన్నదమ్ముల్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న తులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఒడిశాలో బాలికలపై అత్యాచారాలు ఎక్కువై పోయాయి. ఇద్దరు వ్యక్తులు పుట్టిన రోజు పార్టీకి వెళ్లి తిరిగి వస్తున్న బాలికపై అత్యాచారం చేశారు. పొలంలోకి లాక్కెళ్లి అఘాయిత్యం చేశారు. వారి దాడిలో బాలిక తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలైంది.


ఇవి కూడా చదవండి

సూచీలకు భారీ నష్టాలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఏవంటే..

నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా

Updated Date - Jul 25 , 2025 | 04:17 PM