Share News

Deportation: ఈ ఏడాది అమెరికా నుంచి..1,703 మంది భారతీయుల బహిష్కరణ

ABN , Publish Date - Aug 03 , 2025 | 06:14 AM

డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాక.. అమెరికా నుంచి 1,703 మంది భారతీయులను బహిష్కరించారు. వీరంతా అక్రమంగా అమెరికాలో...

Deportation: ఈ ఏడాది అమెరికా నుంచి..1,703 మంది భారతీయుల బహిష్కరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 2: డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాక.. అమెరికా నుంచి 1,703 మంది భారతీయులను బహిష్కరించారు. వీరంతా అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్లు అక్కడి హోంల్యాండ్‌ సెక్యూరిటీ, ఇమిగ్రేషన్‌ అధికారులు తెలిపారు. ఈ గణాంకాలను భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ప్రథమార్థంలో రోజుకు సగటున 8 మంది చొప్పున అమెరికా నుంచి డీపోర్ట్‌ అయినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020-24 మధ్య-- బైడెన్‌ పరిపాలనలో ఈ సంఖ్య రోజుకు సగటున 3గా ఉండేది. ఈ లెక్కన అమెరికా నుంచి భారతీయుల డీపోర్టింగ్‌ ఈ ఏడాది మూడింతలు పెరిగింది. గడిచిన ఐదేళ్లలో మొత్తం 7,244 మంది భారతీయులు అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యారు. వారిలో పాతిక శాతం మంది ఈ ఏడాది తొలి ఆర్నెల్లలోనే భారత్‌కు తిరిగి రావడం గమనార్హం..!

Updated Date - Aug 03 , 2025 | 06:16 AM