Share News

12 Foot Rock Python: గ్రామంలో కలకలం సృష్టించిన భారీ కొండ చిలువ.. భయం గుప్పిట్లో జనం..

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:11 PM

12 అడుగుల భారీ కొండ చిలువ మధ్య ప్రదేశ్‌లోని ఓ గ్రామంలోకి ప్రవేశించింది. కోళ్లను ఇతర చిన్న చిన్న జీవుల్ని తినసాగింది. కొండ చిలువను గుర్తించిన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

12 Foot Rock Python: గ్రామంలో కలకలం సృష్టించిన భారీ కొండ చిలువ.. భయం గుప్పిట్లో జనం..
12 Foot Rock Python

ఈ మధ్య కాలంలో వన్య ప్రాణులు జనావాసాల్లోకి వస్తున్న సంఘటనలు బాగా పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగు బంట్లు తరచుగా వస్తూ ఉన్నాయి. కొన్ని సార్లు భారీ పాములు కూడా గ్రామాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా, మధ్య ప్రదేశ్‌లోని ఓ గ్రామంలోకి భారీ కొండ చిలువ ప్రవేశించింది. గ్రామస్తులను భయాందోళనకు గురి చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం 12 అడుగుల భారీ కొండ చిలువ ఛత్తార్‌పూర్ జిల్లాలోని కచ్రా గ్రామంలోకి ప్రవేశించింది.


కోళ్లను ఇతర చిన్న చిన్న జీవుల్ని తినసాగింది. రెండు రోజుల క్రితం కూడా ఓ జీవిని తిని ఎటూ కదల లేకుండా ఓ చోట పడిపోయింది. ఇది చూసిన గ్రామస్తులు భయపడిపోయారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. కొండ చిలువను బంధించి తమతో పాటు తీసుకెళ్లిపోయారు. తర్వాత దాన్ని బడమల్‌హారా ఫారెస్ట్ రేంజ్‌లో వదిలేశారు. దీనిపై ఫారెస్ట్ రేంజర్ రాజేంద్ర పాస్తౌర్ మీడియాతో మాట్లాడుతూ..


‘ఆ కొండ చిలువ 12 అడుగుల పొడవు ఉంది. 50 కిలోలకు పైగా బరువు ఉంది. ఆ పాము ఏదో జంతువును తినింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. భారీ కొండ చిలువలు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. బడమల్‌హారా ఫారెస్ట్ రేంజ్‌లోనే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ప్రతీ సారి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ టీమ్ పాముల్ని పట్టి, క్షేమంగా అడవుల్లో వదిలేస్తోంది’ అని చెప్పారు. ఇక, భారీ కొండ చిలువలు గ్రామాల్లోకి ప్రవేశిస్తుండటంతో బడమల్‌హారా ఫారెస్ట్ రేంజ్‌లోని గ్రామస్తులు భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు.


ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడును కనుగొన్న పరిశోధకులు

ఆ పేరుతో ఓ బూరె వంటకం ఉందన్న సంగతి మీకు తెలుసా..

Updated Date - Nov 09 , 2025 | 12:23 PM