Share News

Breaking News: టీవీకే చీఫ్‌ విజయ్ కీలక నిర్ణయం..

ABN , First Publish Date - Jul 04 , 2025 | 10:40 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: టీవీకే చీఫ్‌ విజయ్ కీలక నిర్ణయం..
Breaking News

Live News & Update

  • Jul 04, 2025 17:35 IST

    పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టుల భర్తీకి డెడ్‌లైన్‌ పెట్టిన ఖర్గే

    • ఈ నెల 30లోపు పోస్టులన్నీ భర్తీ చేయాలని ఖర్గే ఆదేశం

    • పదవులు భర్తీ కాకుంటే పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్‌దే బాధ్యత: ఖర్గే

    • ఇన్‌చార్జ్‌ మంత్రులు బాధ్యత తీసుకొని పదవుల భర్తీ కోసం లిస్టులు పంపాలి: సీఎం రేవంత్‌

    • పార్టీలో పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని చెప్పిన ఖర్గే

  • Jul 04, 2025 17:10 IST

    వారి కృషితోనే అధికారం: ఖర్గే..

    • కాంగ్రెస్‌ కార్యకర్తల కృషితోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చాం: ఖర్గే

    • రేవంత్‌ రెడ్డి, భట్టి అందరి సమిష్టి కృషితోనే అధికారం సాకారమైంది: ఖర్గే

    • తెలంగాణ ప్రజలు, మహిళలు, రైతులను BRS మోసం చేసింది: ఖర్గే

    • కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అన్నివర్గాలకు న్యాయం: ఖర్గే

  • Jul 04, 2025 15:26 IST

    అమరావతి: ఏడాది కాలంగా రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం సమీక్ష: అనగాని

    • రెవెన్యూలో 10 అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు: అనగాని

    • రూ.10 లక్షల వరకు భూమి విలువ ఉంటే శాంక్షన్‌ సర్టిఫికెట్‌కు రూ.100 ఫీజుగా నిర్ణయం: మంత్రి అనగాని

    • రూ.10 లక్షలపైన విలువ ఉంటే రూ.వెయ్యి ఫీజు: మంత్రి అనగాని

    • సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హమీలు అన్నీ అమలు చేస్తున్నాం: అనగాని

    • శ్మశానాలకు స్ధలాలు ఇవ్వాలని నిర్ణయం: మంత్రి అనగాని

    • హౌసింగ్ ఫర్ ఆల్‌లో భాగంగా ప్రతి పేదవాడికి నివాస యోగ్యమైన ఇల్లు ఉండాలని నిర్ణయం: మంత్రి అనగాని

    • రెండేళ్లలో ఇంటి స్ధలం, మూడేళ్లలో ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం

    • జర్నలిస్టు హౌసింగ్‌కు పేదలకు హౌసింగ్‌కు ముగ్గురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం: మంత్రి అనగాని

  • Jul 04, 2025 15:25 IST

    • తమిళనాడు ఎన్నికల్లో వేర్పాటు వాదులతో పొత్తు ఉండదు: విజయ్‌

    • బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోంది: టీవీకే అధ్యక్షుడు విజయ్‌

    • బీజేపీ విష రాజకీయాలు తమిళనాడులో చెల్లవు: విజయ్‌

  • Jul 04, 2025 15:21 IST

    చెన్నై: TVK చీఫ్‌ విజయ్ కీలక నిర్ణయం

    • ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం

    • బీజేపీతో పొత్తు లేదన్న విజయ్‌

    • విజయ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన TVK

  • Jul 04, 2025 13:46 IST

    సోమాజిగూడ యశోద ఆస్పత్రికి క్యూ కట్టిన BRS నేతలు

    • తీవ్రజ్వరంలో నిన్న యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్‌

    • కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

    • ఆస్పత్రికి వచ్చిన కవిత, జగదీష్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి,

    • శ్రీనివాస్‌ గౌడ్‌, BRS ప్రజాప్రతినిధులు

  • Jul 04, 2025 13:38 IST

    క్రమశిక్షణే కార్యకర్తను నేతగా మారుస్తుంది: ఖర్గే

    • కీలకమైన పదవులలో ఉన్న వారు ఆచితూచి మాట్లాడాలి.

    • ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదు.

    • పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారం వచ్చింది.

    • మరో 15 ఏళ్లు అధికారంలో ఉండేలా పనిచేయాలి.

    • మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలి.

    • పనిచేసే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు దక్కుతుంది.

    • దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.

    • దేశంలో కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతుంది.

  • Jul 04, 2025 12:43 IST

    నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్‌లో వెలుగులోకి సంచలన నిజాలు..

    • ABN చేతిలో నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ FIR కాపీ.

    • 36 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సీబీఐ.

    • ఎన్ఎంసీ సభ్యులు, కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులపై కేసు.

    • ఎఫ్‌ఐఆర్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన డాక్టర్ల పేర్లు.

    • వరంగల్, విశాఖకు చెందిన కాలేజీల డైరెక్టర్లపైనా కేసు.

    • మెడికల్‌ కాలేజీల్లో తనిఖీల సమాచారాన్ని ముందుగానే కాలేజీలకు చేరవేస్తున్న పలువురు ఎన్‌ఎంసీ సభ్యులు.

    • సమాచారం ఇచ్చినందుకు ఎన్ఎంసీ సభ్యులకు లంచాలు.

    • తనిఖీల సమాచారంతో అప్రమత్తమవుతున్న కాలేజీలు.

    • అద్దె ఫ్యాకల్టీతో ఎన్‌ఎంసీని ఏమార్చుతున్న కాలేజీలు.

  • Jul 04, 2025 12:10 IST

    అండమాన్‌ సముద్రంలో భూకంపం

    • రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.9గా నమోదు

    • భూకంప కేంద్రం నుంచి 10 కిలోమీటర్ల మేర ప్రభావం

  • Jul 04, 2025 11:49 IST

    నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ కేసులో 36 మందిపై FIR నమోదు

    • ఎన్ఎంసీ సభ్యులు, కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులపై సీబీఐ కేసు

    • FIRలో ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు డాక్టర్ల పేర్లు

    • వరంగల్, విశాఖకు చెందిన కాలేజీల డైరెక్టర్లపైనా కేసు నమోదు

    • మెడికల్‌ కాలేజీల్లో తనిఖీల సమాచారాన్ని ముందుగానే..

    • కాలేజీలకు చేరవేస్తున్న పలువురు ఎన్‌ఎంసీ సభ్యులు

    • సమాచారం ఇచ్చినందుకు ఎన్ఎంసీ సభ్యులకు భారీగా లంచాలు

    • తనిఖీల సమాచారంతో అప్రమత్తమవుతున్న మెడికల్‌ కాలేజీలు

    • అద్దె ఫ్యాకల్టీతో ఎన్‌ఎంసీని ఏమార్చుతున్న మెడికల్‌ కాలేజీలు

  • Jul 04, 2025 11:08 IST

    హైదరాబాద్‌: లక్డీకాపూల్‌లో కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహావిష్కరణ

    • 9 అడుగుల రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఖర్గే, సీఎం రేవంత్‌

    • తెలంగాణలో అధికారికంగా రోశయ్య జయంతి వేడుకలు

  • Jul 04, 2025 10:41 IST

    హైదరాబాద్‌: తాజ్‌కృష్ణాలో కేసీ వేణుగోపాల్‌తో కీలక నేతల సమావేశం

    • పాల్గొన్న సీఎం రేవంత్‌, మహేష్‌గౌడ్‌, మీనాక్షి నటరాజన్‌, ఉత్తమ్‌, కోమటిరెడ్డి

    • తెలంగాణ కేబినెట్‌ విస్తరణపై కసరత్తు

    • మిగిలిన మూడు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశంపై చర్చ

  • Jul 04, 2025 10:40 IST

    జూరాలకు పోటెత్తుతున్న వరద, 10 గేట్లు ఎత్తివేత.

    • ఇన్ ఫ్లో 98,290, ఔట్ ఫ్లో 1,00,878 వేల క్యూ సెక్కులు.

    • పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు, ప్రస్తుతం 1042 అడుగులు.

    • పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు, ప్రస్తుతం 7.855 టీఎంసీలు.

    • ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.