Share News

Relationship Tips: అత్తమామలతో గొడవపడి పుట్టింట్లో ఉంటున్నారా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..

ABN , Publish Date - May 25 , 2025 | 02:33 PM

వివాహ బంధంలో గొడవలు జరగడం సాధారణం. ఈ కారణంగా అత్తమామలతో కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. చాలా మంది అత్తమామలతో గొడవపడి పుట్టింటికి వెళ్లే వారు కూడా ఉన్నారు. అయితే, ఎక్కువ కాలం పుట్టింట్లో ఉంటే మీకే సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Relationship Tips: అత్తమామలతో గొడవపడి పుట్టింట్లో ఉంటున్నారా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..
Women

వివాహం తర్వాత అత్తమామల ఇంట్లో చిన్న చిన్న అభిప్రాయభేదాలు రావడం సహజం. కానీ, కొన్నిసార్లు తగాదాలు చాలా పెద్ద సమస్యగా మారుతాయి. అలంటి సందర్భాలలో చాలా మంది మహిళలు గొడవ పడి వెంటనే తమ పుట్టింటికి వెళ్తారు. అయితే, పుట్టింట్లో కొన్ని రోజల వరకు ఉంటే పర్వలేదు. కానీ ఎక్కువ కాలం ఉంటే మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


సంబంధంలో పగుళ్లు

ఎక్కువ కాలం అత్తమామలకు దూరంగా ఉంటే ఆ ఇంట్లో వారితో సంబంధం దెబ్బతింటుంది. భార్యాభర్తల మధ్య భావోద్వేగ దూరం పెరుగుతుంది. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అపార్థాలు పెరిగి సంబంధాన్ని బలహీనపరుస్తాయి.

పిల్లలపై ప్రతికూల ప్రభావం

దంపతులకు పిల్లలు ఉంటే, ఆ మహిళ అత్తింట్లో గొడవ తమ పుట్టింట్లో ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు. తల్లిదండ్రుల ఇంట్లో ఎక్కువ కాలం ఉండటం వల్ల పిల్లల మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఉన్న దూరం వల్ల మానసిక సమస్యలతో పడతారు. అభద్రత లేదా ఆందోళనతో బాధపడవచ్చు. వారి చదువులు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.

3. పరువు నష్టం

తల్లిదండ్రుల ఇంట్లో ఎక్కువ కాలం ఉండటం వల్ల కుటుంబంలో, సమాజంలో పరువు పోతుంది. మీ గురించి తప్పుడు ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది. ఇది రెండు కుటుంబాల ప్రతిష్టకు హాని కలిగించవచ్చు.

4. తల్లిదండ్రులపై ఆధారపడటం

పుట్టింట్లో ఇంట్లో ఎక్కువ కాలం ఉండటం వల్ల ఆర్థికంగా, మానసికంగా తల్లిదండ్రులపై ఆధారపడాల్సి వస్తుంది. అంతేకాకుండా, అత్తమామల బాధ్యతల నుండి దూరం ఉండటం వల్ల సంబంధం మెరుగుపడే అవకాశం కూడా తగ్గుతుంది.

5. చట్టపరమైన సమస్యలు

తల్లిదండ్రుల ఇంట్లో ఎక్కువ కాలం ఉండి కూడా పరిష్కారం దొరకకపోతే, అది చట్టపరమైన వివాదంగా మారవచ్చు. కోర్టులో కేసు గెలవడం అంత సులభం కాదు. ఎందుకంటే చట్టపరమైన ప్రక్రియకు చాలా సమయం పట్టవచ్చు. ఇది మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.


పరిష్కారం ఏమిటి?

  • గొడవ అయిన వెంటనే మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడం మంచిది కాదు. ఎందుకంటే దూరం పెరిగే బంధం తగ్గిపోతుంది. దానికి బదులుగా ఇంట్లోనే మీ సమస్యను పరిష్కరించుకోండి.

  • కుటుంబ పెద్దల సహాయం తీసుకోండి.

  • మీ తల్లిదండ్రుల ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే, ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు. ఇంట్లోనే ఉండి సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి.

  • అత్తమామల ఇంట్లో గొడవలను పరిష్కరించడానికి ఓపిక, అవగాహన అవసరం.


Also Read:

Harish Rao: ఏపీకి ఒక నీతి.. తెలంగాణకు మరొక నీతా..

Mini Mahanadu: జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఘనంగా మినీ మహానాడు

For More Telugu And National News

Updated Date - May 25 , 2025 | 02:33 PM