Share News

AC: మీ ఇంట్లో ఏసీ ఉందా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..

ABN , Publish Date - Apr 28 , 2025 | 08:08 AM

ఏప్రిల్, మే, జూన్ నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఏసీలు ఉపయోగిస్తుంటారు. అయితే ఏసీ ఆఫ్ చేయడంలో చాలామంది కొన్ని తప్పులు చేస్తుంటారు. తద్వారా ఏసీ పాడయ్యే అవకాశం ఉంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

AC: మీ ఇంట్లో ఏసీ ఉందా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..
Air conditioner

ఈ మధ్యకాలంలో ఏసీ (Air conditioner) ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా అయిపోయింది. వేసవి కాలం (Summer) కావడంతో ఉష్ణోగ్రతలు (Temperatures)పెరిగిపోతున్నాయి. అధిక వేడిని తట్టుకోలేక చల్లదనం కోసం జనాలు ఏసీ వాడుతుంటారు. అయితే సరైన రీతిలో ఉపయోగించకపోతే అది పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంది. ఎక్కువ డబ్బులు పెట్టి రిపేయిర్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఏసీ రన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు (Tips) పాటించాలి. ముఖ్యంగా ఏసీ ఆన్ చేసేటప్పుడు లేదా ఆఫ్ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.

Also Read: కేంద్రంపై 1.50 లక్షల కోర్టు ధిక్కరణ కేసులు


రిమోట్‌తోనే ఏసీ ఆఫ్ చేయాలి.. ఎందుకంటే..

చాలామందికి తెలియక ఏసీ ఆన్‌లో ఉండగా గోడకు ఉండే స్విచ్ ఆఫ్ చేస్తారు. కానీ అలా చేయకూడదు.. రిమోట్‌తోనే ఏసీ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత గోడకు ఉన్న స్వీచ్ ఆఫ చేయాలి. ఏ ఏసీలకైనా కంప్రెసర్ అనేది ఏసీకి గుండె వంటిది. హఠాత్తుగా స్విచ్ ఆఫ్ చేస్తే పవర్ కట్స్ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనితో కంప్రెసర్ బ్రేక్ డౌన్ అయిపోయే అవకాశం కూడా ఉంటాది. ఆ తర్వాత కంప్రెసర్ రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఏసీ టెంపరేచర్ కూడా సరైన స్థితిలో ఉండాలి. తక్కువగా పెట్టిన.. మరీ హైలో పెట్టిన అది మొత్తం కూలింగ్‌పై ప్రభావం పడుతుంది. దీంతో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటాది. ఏసీ మోటారు, ఇంటర్నల్ ఫ్యాన్ సరైన రీతిలో పని చేయాలి . ఇలా సడన్‌గా స్విచ్ ఆఫ్ చేయడం వల్ల మోటార్ పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే ఎప్పుడూ ఏసీ ఆఫ్ చేసినా రిమోట్‌తో మాత్రమే ఆఫ్ చేయాలి.


ఏసీ పిల్టర్లు శుభ్రంగా ఉంచుకోవాలి..

ఏసీ కెపాసిటీని సాధారణంగా టన్నుల్లో కొలుస్తారు. మామూలుగా ఒక టన్ను నుంచి రెండు టన్నుల వరకు ఏసీలు ఉంటాయి. ఎక్కువ స్టార్ ఉన్న ఏసీ అయితే తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. ఉదాహరణకు 3 స్టార్‌ ఏసీ ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తే, 5 స్టార్‌ ఏసీ తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ఎప్పటికప్పుడు ఏసీ పిల్టర్లు శుభ్రంగా ఉంచుకోవాలి. బయట నుంచి వేడి గాలులు రాకుండా కర్టెన్లు వేసుకోవాలి. గంటల తరబడి ఏసీ ఆన్ చేసి ఉంచకుండా, కాసేపు వేసుకున్న తరువాత ఫ్యాన్‌ వేసుకుంటే రూమ్ చల్లగా ఉంటుంది.

చిన్నచిన్న టిప్స్..

అయితే కొన్ని చిన్నచిన్న టిప్స్ పాటిస్తే విద్యుత్తు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. సాధారణంగా ఫిలమెంట్‌ బల్బు ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. కాబట్టి తక్కువ విద్యుత్తు తీసుకునే ఎల్‌ఈడీ బల్బును ఉపయోగించుకోవాలి. 60 వాట్ల ఫిలమెంటు బల్బు ఇచ్చే వెలుగును కేవలం 9 వాట్స్‌ ఎల్‌ఈడీ బల్బు ఇస్తుంది.

ఇంట్లో ఫ్యాన్ ఫుల్‌ స్పీడుతో తిరిగితే కరెంటు బిల్లు అధికంగా వస్తుంది. 2 లేదా 3లో పెట్టుకుంటే విద్యుత్తు ఆదా అవుతుంది. ఫ్యాన్ బేరింగ్‌ దెబ్బతిన్న శబ్ధం వస్తే వెంటనే రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మోటారుపై లోడు ఎక్కువగా పడి విద్యుత్తు వినియోగం అధికం అవుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మోదీ సభకు చకచకా ఏర్పాట్లు

తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ విలనా

For More AP News and Telugu News

Updated Date - Apr 28 , 2025 | 09:19 AM