Torn Jeans Travel Restrictions: వామ్మో.. చిరిగిన జీన్స్ వేసుకుంటే జైలు శిక్ష పడుతుందా.!
ABN , Publish Date - Nov 29 , 2025 | 07:42 PM
చాలా మంది స్టైల్ కోసం చిరిగిన జీన్స్ ధరిస్తారు. అయితే, చిరిగిన జీన్స్ వేసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉందని మీకు తెలుసా? ఎట్టి పరిస్థితిలోనూ చిరిగిన జీన్స్ వేసుకుని ఈ దేశాలకు వెళ్లకండి..
ఇంటర్నెట్ డెస్క్: ఫ్యాషన్ ట్రెండ్స్ కాలంతో పాటు మారుతూ ఉంటాయి. ఒకప్పుడు, చిరిగిన బట్టలు ధరించడానికి మనం సిగ్గుపడేవాళ్ళం, నలుగురితో కలిసి బయటకు వెళ్ళడానికి కూడా సిగ్గుపడేవాళ్ళం. కానీ ఇప్పుడు, చిరిగిన జీన్స్ ధరించడం ఫ్యాషన్‌గా మారింది. అయితే, కొన్ని దేశాలలో అలాంటి జీన్స్ ధరించకుండా కఠినమైన చట్టాలు ఉన్నాయి. చిరిగిన జీన్స్ వేసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉందని మీకు తెలుసా? ఎట్టి పరిస్థితిలోనూ చిరిగిన జీన్స్ వేసుకుని ఈ దేశాలకు వెళ్లకండి..
ఇరాన్:
ఈ దేశంలో ఫ్యాషన్ దుస్తులకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. బహిరంగంగా చిరిగిన జీన్స్ ధరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాంటి జీన్స్ ధరించడం వల్ల జరిమానాలు లేదా జైలు శిక్ష విధించవచ్చు. ఇది దేశ సాంస్కృతిక, మతపరమైన గుర్తింపుకు విరుద్ధమని ఇరాన్ ప్రభుత్వం చెబుతోంది.
సౌదీ అరేబియా:
సౌదీ అరేబియాలో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో చిరిగిన దుస్తులు ధరించకూడదు. చిరిగిన జీన్స్ వంటి దుస్తులు ధరించడం వల్ల కఠినమైన శిక్షలు పడతాయి. అలాంటి దుస్తులు అక్కడ అసభ్యకరంగా పరిగణిస్తారు. అలాంటి దుస్తులు ధరించిన మహిళలు కఠినమైన చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటారు.
తాలిబాన్
ఈ దేశంలో మహిళలు చిరిగిన జీన్స్ ధరించడం నిషేధం. అలాంటి జీన్స్ ధరించి పట్టుబడిన వారికి జైలు శిక్ష లేదా జరిమానాతో సహా శిక్ష ఉంటుంది.
పాకిస్తాన్
పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలు చిరిగిన జీన్స్ ధరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని మతపరమైన సమూహాలు కూడా అలాంటి దుస్తులను వ్యతిరేకిస్తాయి, కాబట్టి ఇక్కడ కూడా అలాంటి జీన్స్ ధరించడం నిషేధించం.
Also Read:
ఫుడ్ లవర్స్.. ఈ పంజాబీ వంటకాలు ఒక్కసారి ట్రై చేస్తే చాలు, మళ్లీ మిస్ అవ్వరు!
డయాబెటిస్ వారికి ఎంతో మేలు చేసే పండ్లు ఇవే!
For More Latest News