Share News

IRCTC Madhya Pradesh : మధ్యప్రదేశ్ మహా దర్శన్.. శివభక్తుల కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:21 PM

హిందూ సంప్రదాయంలో పవిత్రంగా పరిగణించే శ్రావణ మాసం ఈ నెల 25న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా IRCTC శివభక్తుల కోసం ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

IRCTC Madhya Pradesh :  మధ్యప్రదేశ్ మహా దర్శన్.. శివభక్తుల కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ
Madhya Pradesh Maha Darshan

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు శివుని దర్శించేందుకు పుణ్యక్షేత్రాలకు వెళ్లుతుంటారు. శ్రావణ మాసం శివునికి అంకితమైన పవిత్రమైన కాలం. ఈ సందర్భంగా IRCTC భక్తుల కోసం ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా ఎంతో విశిష్టత కలిగిన ఓంకారేశ్వర్, మహేశ్వర్, ఉజ్జయిని, ఇండోర్‌ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. అయితే, ఈ ప్యాకేజీకు సంబంధించిన వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం..


ప్యాకేజీ వివరాలు:

ప్యాకేజీ పేరు: మధ్యప్రదేశ్ మహాదర్శన్ టూర్ ప్యాకేజీ

ప్యాకేజీ కోడ్: SHA15

టూర్ వ్యవధి: 4 రాత్రులు – 5 రోజులు

టూర్ ప్రారంభ తేదీ: జూలై 30, 2025

ప్రయాణ ప్రారంభ స్థలం: హైదరాబాద్ విమానాశ్రయం

ప్రయాణ రకాలు: విమానం + బస్సు

సదుపాయాలు: ఆహారం, బస, గైడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్


ప్యాకేజీలో ఉండే సౌకర్యాలు:

  • హైదరాబాద్↔ఇండోర్ విమాన టిక్కెట్లు

  • హోటల్ బస (4 రాత్రులు)

  • 4 బ్రేక్‌ఫాస్ట్ + 4 డిన్నర్

  • AC బస్సు ద్వారా లోకల్ సైటింగ్స్

  • ట్రావెల్ ఇన్సూరెన్స్

ప్యాకేజీలో ఉండని అంశాలు:

  • ఆలయాల్లో ప్రత్యేక దర్శన టిక్కెట్లు

  • విమానంలో భోజనం

  • ఇతర వ్యక్తిగత ఖర్చులు

IRCTC Special Package.jpg


టికెట్ ధరలు:

సింగిల్ ఆక్యుపెన్సీ - రూ. 37,250

డబుల్ ఆక్యుపెన్సీ - రూ. 30,400

ట్రిపుల్ ఆక్యుపెన్సీ - రూ. 29,200

పిల్లలు (5-11ఏళ్లు, బెడ్‌తో) - రూ. 26,600

పిల్లలు (5-11ఏళ్లు, బెడ్ లేకుండా) - రూ. 23,300

చిన్నపిల్లలు (2-4ఏళ్లు) - రూ. 19,400

ఈ ప్యాకేజీ ఆధ్యాత్మిక విజ్ఞానయాత్రగా భావించే వారికి అద్భుతమైన అవకాశంగా నిలుస్తోంది. IRCTC ఈ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, ఖర్చు తగ్గేలా నిర్వహిస్తోంది. మీరు ఈ టూర్‌లో భాగం కావాలంటే, IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా త్వరగా బుకింగ్ చేసుకోండి.


Also Read:

ల్యాండ్ స్నార్కెలింగ్ .. 2025లో సరికొత్త ట్రెండ్.!

పాత బట్టలు పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే డబ్బే డబ్బు..!

For More Lifestyle News

Updated Date - Jul 22 , 2025 | 05:33 PM