Share News

Tourist Places in AP: వర్షాకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన అందమైన టూరిస్టు ప్రదేశాలు ఇవే..

ABN , Publish Date - Aug 02 , 2025 | 06:22 PM

వర్షాకాలంలో ప్రకృతి మరింత అందంగా మారుతుంది. ఎందుకంటే, వర్షం కారణంగా పచ్చదనం పెరుగుతుంది. జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తాయి. వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది.

Tourist Places in AP: వర్షాకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన అందమైన టూరిస్టు ప్రదేశాలు ఇవే..
AP Vocation Places

ఇంటర్నెట్ డెస్క్‌: వర్షాకాలంలో ప్రకృతి మరింత అందంగా మారుతుంది. ఎందుకంటే, వర్షం కారణంగా పచ్చదనం పెరుగుతుంది. జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తాయి. వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి అందమైన టూరిస్టు ప్లేసులు చాలా ఉన్నాయి. అయితే, అందులోని కొన్ని ముఖ్యమైన ప్లేసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


అరకు లోయ

విశాఖకు దగ్గరలోని చాలా అందమైన ప్రదేశం అరకు లోయ. ఇది ప్రకృతి రమణీయత, గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. పచ్చటి కొండలు, కాఫీ తోటలు, జలపాతాలు, గిరిజన గ్రామాలు ఇక్కడి ప్రత్యేకతలు. అలాగే, విశాఖపట్నంలో రుషికొండ బీచ్, కైలాసగిరి, బొర్రా గుహలు వంటి సుందరమైన ప్రదేశాలు కూడా చూడవచ్చు.

శ్రీశైలం

ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఇది ప్రకృతి రమణీయతకు ప్రసిద్ధి చెందింది. శ్రీశైలం వర్షాకాలంలో చాలా అందంగా ఉంటుంది. పచ్చదనం, జలపాతాలు, నల్లమల అడవుల అందాలు వర్షాకాలంలో మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. మల్లికార్జునస్వామి ఆలయం, శ్రీశైలం డ్యామ్, పాతాళ గంగ మరింత అందంగా కనిపిస్తాయి.

Srisailam.jpg


గండికోట

గండికోట..భారతదేశపు గ్రాండ్ కాన్యన్ గా ప్రసిద్ధి చెందింది. వర్షాకాలంలో ఇది మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఆకుపచ్చని ప్రకృతి, ఉప్పొంగే నది, నల్లటి మబ్బుల వెనుక నుంచి వచ్చే సూర్యరశ్మి అన్నీ కలిసి ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి.

మారేడుమిల్లి

తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఒక అందమైన గిరిజన ప్రాంతం మారేడుమిల్లి. ఇది దట్టమైన అడవులు, జలపాతాలు, ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. మారేడుమిల్లిలో తప్పక చూడవలసిన ప్రదేశాలు ఏవంటే అమృతధార జలపాతం, స్వామివారి పాదాలు, వలసపల్లి జలపాతం, బలిమెల రిజర్వాయర్.

Maredumilli.jpg


తిరుపతి

తిరుపతిలో వర్షాకాలంలో చూడటానికి చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా తిరుమల కొండలు, తలకోన జలపాతం, కపిల తీర్థం, చంద్రగిరి కోట, పులికాట్ సరస్సు వర్షాకాలంలో మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.

Also Read:

లంచ్ చేసుకోవడానికి టైం ఉండట్లేదా.. 5 ఫాస్ట్ రెసిపీ ఐడియాస్ మీకోసమే..

ఇంట్లో ఎలుకలను చంపకుండా వదిలించుకోవడం ఎలా?

For More Lifestyle News

Updated Date - Aug 02 , 2025 | 08:27 PM