Share News

Metro: మెట్రోలో ప్రయాణించే ప్రతి మహిళ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:29 AM

మెట్రోలో రోజూ ప్రయాణిస్తున్న మహిళలు భద్రత, సౌకర్యం కోసం వీటిని పాటించడం మంచిది. మెట్రోలో ప్రయాణించే ప్రతి మహిళ తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Metro: మెట్రోలో ప్రయాణించే ప్రతి మహిళ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
Metro

ఈ రోజుల్లో మెట్రో అనేది చాలా మందికి అందుబాటులో ఉండే, సురక్షితమైన ప్రయాణ మార్గంగా మారింది. ముఖ్యంగా ఉద్యోగులకు, విద్యార్థులకు ఇది పెద్ద వరం. మహిళలు కూడా మెట్రోను సౌకర్యంగా, భద్రంగా భావిస్తూ ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. అయితే మెట్రోలో సురక్షితంగా, శాంతంగా ప్రయాణించాలంటే కొన్ని చిన్న విషయాలను గుర్తుంచుకోవడం మంచిది.


లేడీస్ కోచ్‌ను ఎంచుకోండి

ప్రతి మెట్రో ట్రైన్‌లో ఒక ప్రత్యేకమైన కోచ్ మహిళల కోసం మాత్రమే ఉంటుంది. ఇది రద్దీ తక్కువగా ఉండటంతో పాటు సురక్షితంగా కూడా ఉంటుంది. ప్రత్యేకించి పీక్ టైమ్‌లో, ఉదయం ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు ఈ కోచ్‌లో ప్రయాణించడం మంచిది.

మీ బట్టలపై దృష్టి పెట్టండి

మెట్రో ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు పొడవైన దుప్పట్టా, చీర, స్కార్ఫ్, లేదా పర్స్ తలుపులో ఇరుక్కుపోకుండా చూసుకోవాలి. ఇటువంటి చిన్న పొరపాట్లు ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా తొందరపడితే, బట్టలు తలుపులో ఇరుక్కుని ప్రమాదం జరుగుతుంది. అజాగ్రత్తగా ప్రవర్తిస్తే జరిమానా కూడా విధించవచ్చు.


బాధ్యతతో వ్యవహరించండి

మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు కొంత బాధ్యతతో వ్యవహరించాలి. పెద్దగా మాట్లాడడం, లౌడ్‌గా సాంగ్స్ పెట్టడం, వీడియోలు తీయడం లేదా మెట్రోలో తినడం వంటి పనులు చేయవద్దు. ఇవి ఇతరులకు అసౌకర్యం కలిగించడమే కాకుండా, కొన్ని విషయాలకు జరిమానా కూడా పడుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, వికలాంగుల వంటి వారికి సీటు ఇచ్చే మంచి అలవాటు పెంచుకోండి.

రద్దీ సమయాల్లో జాగ్రత్త

రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ప్రయాణిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జుట్టును వదులుకోకుండా రబ్బర్ బాండ్ ధరించండి. బ్యాగ్‌ను ఎప్పుడూ ముందుగా ఉంచుకోండి. ఫోన్, వాలెట్ వంటి వస్తువులు సురక్షితంగా ఉంచండి. ఫోన్ చేతిలో పట్టుకొని కదలడం కంటే, బ్యాగ్‌లో ఉంచుకుని ఇయర్‌ఫోన్లు ఉపయోగించడమే మంచిది.

అత్యవసర పరిస్థితుల్లో ఇలా చేయండి

ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే భయపడకండి. ప్రతి మెట్రోలో హెల్ప్‌లైన్ నంబర్‌, ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది. అవసరమైతే వాటిని వాడండి. కొన్నిసార్లు మిశ్రమ కోచ్‌లలో మహిళలు అసౌకర్యకర పరిస్థితిని ఎదుర్కోవచ్చు. అటువంటి సమయంలో ధైర్యంగా ఉండాలి. అవసరమైతే అధికారులకు తెలపాలి. భద్రత కోసం పెప్పర్ స్ప్రే లాంటి వాటిని మీ బ్యాగ్‌లో ఉంచుకోవచ్చు.


Also Read:

నాకు డ్రగ్స్ ఇచ్చారు.. పోలీసుల విచారణలో సోనమ్..

జడ్జి పేరు చెప్పారు.. డబ్బులు లాగారు.. కేటుగాళ్ల నయా మోసం

For More Lifestyle News

Updated Date - Jun 10 , 2025 | 11:43 AM