Hair Fall Reasons: ఈ 5 ఆహారాలు జుట్టు రాలడాన్ని పెంచుతాయి.!
ABN , Publish Date - Oct 15 , 2025 | 08:42 AM
ఈ రోజుల్లో జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య, మనం తరచుగా షాంపూ లేదా కాలుష్యామే జుట్టు రాలడానికి కారణమని అనుకుంటాం. కానీ, కొన్ని ఆహారాలు కూడా జుట్టు రాలడాన్ని పెంచుతాయని మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత జీవనశైలిలో ఒత్తిడి, కాలుష్యం వంటి కారణాల వల్ల చాలా మంది జట్టు రాలడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. జుట్టు పల్చబడటానికి, చివర్లు చిట్లిపోవడానికి, చుండ్రుతో కూడిన దురదతో కూడా బాధపడుతున్నారు. మనం తరచుగా షాంపూ లేదా కాలుష్యామే జుట్టు రాలడానికి కారణమని అనుకుంటాం. కానీ, కొన్ని ఆహారాలు కూడా జుట్టు రాలడాన్ని పెంచుతాయని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చక్కెర ఆహారాలు
చక్కెర ఆహారాలు ఊబకాయానికి మాత్రమే కారణం కావు, అవి మీ జుట్టును కూడా బలహీనపరుస్తాయి. ఎక్కువ చక్కెర తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి, ఇది ఆండ్రోజెన్లు అనే హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. ఈ హార్మోన్లు జుట్టు కుదుళ్లను బలహీనపరిచి జుట్టు రాలడానికి దారితీస్తాయి.

జంక్ ఫుడ్స్
జంక్ ఫుడ్స్ జుట్టుకు హానికరం, ఎందుకంటే దీనిలో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, సోడియం ఎక్కువగా ఉంటాయి, ఇవి జుట్టు కుదుళ్లను దెబ్బతీసి, పోషకాహార లోపానికి కారణమవుతాయి. దీనివల్ల జుట్టు బలహీనపడటం, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి
అధిక ఉప్పు ఆహారం
అధికంగా కారం, ఉప్పు ఉన్న ఆహారం జుట్టు రాలడాన్ని పెంచుతుంది. అధిక ఉప్పు జుట్టును పొడిగా, బలహీనంగా మార్చి, చిండ్రు, చివర్లు చిట్లడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే, జుట్టు ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్లు వంటి పోషకాల లోపం జరగవచ్చు, దీనికి ప్రత్యామ్నాయంగా గుడ్లు, చేపలు, ఆకుకూరలు వంటివి తీసుకోవడం మంచిది.

మద్యం
ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది . శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు, అది జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల సులభంగా జుట్టు రాలుతుంది.
కొన్ని రకాల పాల ఉత్పత్తులు
కొన్ని పాల ఉత్పత్తులు, ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఉండేవి, శరీరంలో సెబమ్ ఉత్పత్తిని పెంచుతాయి. సెబమ్ అనేది జిడ్డుగల పదార్థం, ఇది అధికంగా ఉండటం వల్ల జుట్టు రంధ్రాలను మూసుకుపోతుంది, జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది. జుట్టు రాలడానికి కారణమవుతుంది. మీరు జుట్టు రాలడాన్ని ఎదుర్కొంటుంటే, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది.
ఈ వార్తలు కూడా చదవండి..
షాకింగ్ .. ఎమ్‌టీవీ మ్యూజిక్ ఛానల్ మూసివేత
Read Latest Telangana News and National News