Telegram Earning Tips: టెలిగ్రామ్ ద్వారా లక్షల ఆదాయం.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే.!
ABN , Publish Date - Jul 04 , 2025 | 11:59 AM
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది టెలిగ్రామ్ యాప్ ఉపయోగిస్తున్నారు. 2025లో ఈ ట్రెండ్ మరింత వేగంగా పెరుగుతోంది. అయితే, ఈ యాప్ ద్వారా నెలకి లక్ష రూపాయలు సంపాదించవచ్చని మీకు తెలుసా?

Telegram Earning Tips: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టెలిగ్రామ్ యాప్ ఉపయోగిస్తున్నారు. ఇది ఒక మెసేజింగ్ యాప్. ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్‌లను షేర్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. అయితే, మీరు టెలిగ్రామ్‌ను సరైన మార్గంలో ఉపయోగిస్తే మీరు ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అది కూడా ఇంట్లో ఉండి మీ మొబైల్‌లో ద్వారా చేయవచ్చు. అయితే, ఈ యాప్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
టెలిగ్రామ్ ఛానెల్
టెలిగ్రామ్‌లో పెయిడ్ ఛానల్ లేదా గ్రూప్ ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్, కరెంట్ అఫైర్స్, కెరీర్ గైడెన్స్, మోటివేషన్ లేదా ఫిట్‌నెస్ వంటి అంశాలపై మీకు నైపుణ్యం ఉంటే మీరు పెయిడ్ మెంబర్‌షిప్‌తో ఛానల్‌ను ప్రారంభించవచ్చు. ఉదాహరణకు, మీరు నెలకు రూ.99 లేదా రూ.199 ఫీజ్‌తో 500 మంది సభ్యులను చేర్చుకుంటే మీరు ప్రతి నెలా రూ.50,000 వరకు సంపాదించవచ్చు. కొంతమంది నిపుణులు వేలాది మంది సభ్యులతో ప్రతి నెలా ఇలా లక్షలు సంపాదిస్తున్నారు.
డిజిటల్ ఉత్పత్తులను అమ్మడం
టెలిగ్రామ్‌లో ఈబుక్స్, కోర్సులు, డిజైన్ టెంప్లేట్‌లు, వాల్‌పేపర్ ప్యాక్‌లు లేదా నోట్స్ వంటివి అమ్మవచ్చు. చాలా మంది విద్యార్థులు, నిపుణులు టెలిగ్రామ్ ద్వారా వారి టాలెంట్స్‌ను డెవలప్ చేసుకుంటూ ఇలా డబ్బులు సంపాదిస్తున్నారు. టెలిగ్రామ్‌లో ఒక ఛానెల్‌ని క్రియేట్ చేసి మీ ఉత్పత్తుల ద్వారా కస్టమర్ల నుండి చెల్లింపు తీసుకోవచ్చు. మీరు ఏ వెబ్‌సైట్ లేకుండానే టెలిగ్రామ్ ద్వారా ఇలా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
అనుబంధ మార్కెటింగ్ నుండి సంపాదన
మీకు టెలిగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో లేదా ఇతర కంపెనీల అనుబంధ లింక్‌లను షేర్ చేయవచ్చు. ఆ లింక్ నుండి ఒక వినియోగదారు ఉత్పత్తిని కొనుగోలు చేసిన వెంటనే మీకు కమీషన్ వస్తుంది. గాడ్జెట్ డీల్స్, ఫ్యాషన్, ఆరోగ్య ఉత్పత్తులు వంటివి ద్వారా నెలకు రూ. 10,000 నుండి లక్ష వరకు సంపాదించవచ్చు.
ప్రమోషన్, ప్రకటనలు
మీ టెలిగ్రామ్ ఛానెల్‌లో వేల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉంటే ఇతర బ్రాండ్‌లు లేదా ఛానెల్‌లు ప్రమోషన్ కోసం మిమ్మల్ని సంప్రదిస్తాయి. టెలిగ్రామ్ ఛానెల్ ప్రమోషన్‌కు ఒక్కో పోస్ట్‌కు రూ. 500 నుండి రూ. 5,000 వరకు వసూలు చేయవచ్చు. మీ ఛానెల్ పెరుగుతున్న కొద్దీ ప్రమోషనల్ ఆఫర్‌లు కూడా పెరుగుతాయి. ఇలా మీరు ప్రతి నెలా లక్షల వరకు సంపాదించవచ్చు.
టెలిగ్రామ్ సేవలను అందించడం
మీకు కోడింగ్ లేదా ఆటోమేషన్ గురించి నైపుణ్యం ఉంటే మీరు టెలిగ్రామ్ ద్వారా సేవలను అందించవచ్చు. చాలా మంది ఫ్రీలాన్సర్లు టెలిగ్రామ్ బాట్‌ల ద్వారా ప్రతి ప్రాజెక్ట్ నుండి రూ. 10,000 నుండి రూ. 50,000 వరకు సంపాదిస్తున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఈ రంగు నెయిల్ పాలిష్ వేసుకుంటే.. మీ లవర్‌తో బ్రేకప్ ఖాయం..!
ఆఫీస్ బ్యాగ్‌లో ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసా..
For More Lifestyle News