Share News

WhatsApp Earning: వాట్సాప్ ద్వారా వేల ఆదాయం.. ఎలానో తెలుసా?

ABN , Publish Date - Jul 04 , 2025 | 11:04 AM

ప్రస్తుతం చాలా మంది ఉపయోగించే యాప్స్‌లో వాట్సాప్ ఒకటి. అయితే, ఇది కేవలం మెసేజ్‌లు పంపడానికి లేదా కాల్ చేయడానికి మాత్రమే కాకుండా డబ్బు సంపాదించడానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా?

WhatsApp Earning: వాట్సాప్ ద్వారా వేల ఆదాయం.. ఎలానో తెలుసా?
WhatsApp Earning

WhatsApp Earning : ఈ డిజిటల్ యుగంలో మనందరి ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్.. వాట్సాప్. చాలా మంది దీనిని కేవలం మెసేజ్‌లు పంపడానికి, వీడియో కాల్స్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ, ఈ యాప్‌ని సరైన రీతిలో వాడితే అది డబ్బు సంపాదించడానికి ఒక మంచి మార్గం కూడా అవుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


వాట్సాప్ బిజినెస్ యాప్

వాట్సాప్ చిన్న వ్యాపారుల కోసం వాట్సాప్ బిజినెస్ అనే ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ సహాయంతో మీరు మీ ఉత్పత్తులు లేదా సేవలను ప్రొఫెషనల్ పద్ధతిలో ప్రమోట్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఉత్పత్తి కేటలాగ్, ఆటోమేటిక్ రిప్లై, లేబుల్స్, బిజినెస్ ప్రొఫైల్ వంటి ఫీచర్‌లను ఉపయోగించి కస్టమర్‌లతో నేరుగా కనెక్ట్ అవ్వవచ్చు. ఉదాహరణకు మీరు బట్టలు, ఆభరణాలు, ఇంట్లో తయారుచేసిన ఆహారం లేదా ఏదైనా స్థానిక ఉత్పత్తులలో వ్యాపారం చేస్తుంటే మీరు మీ కస్టమర్ల నుండి ఆర్డర్లు తీసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపులను కూడా స్వీకరించవచ్చు. ఇలా వాట్సాప్ బిజినెస్ యాప్ వ్యాపారాలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆన్‌లైన్ కోర్సు

మీకు కెరీర్ గైడెన్స్, షేర్ మార్కెట్ చిట్కాలు, ఫిట్‌నెస్ లేదా విద్య వంటి ఏదైనా నైపుణ్యం ఉంటే మీరు ఒక వాట్సాప్ గ్రూప్‌ క్రియేట్ చేసి ఆన్‌లైన్ కోర్సు పెట్టవచ్చు. చాలా మంది నిపుణులు ఇలా చేస్తున్నారు. 99 నుండి 499 రూపాయల వరకు ఫీజ్ వసూలు చేస్తూ నెలకు వేల రూపాయలు సంపాదిస్తున్నారు.

చిన్న డిజిటల్ సేవలు

మీకు డిజిటల్ పోస్టర్లు, పుట్టినరోజు కార్డులు, వెడ్డింగ్ కార్డులు, సోషల్ మీడియా డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ లేదా మెనూ కార్డులను ఎలా డిజైన్ చేయాలో తెలిస్తే మీరు వాట్సాప్ ద్వారా మీ సేవలను ప్రచారం చేసుకోవచ్చు. మీరు కస్టమర్‌తో నేరుగా మాట్లాడి వారికి కావాల్సిన విధంగా కార్డ్స్ తయారుచేసి డబ్బు సంపాదించవచ్చు.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

ఈ రంగు నెయిల్ పాలిష్ వేసుకుంటే.. మీ లవర్‌తో బ్రేకప్ ఖాయం..!

ఆఫీస్ బ్యాగ్‌లో ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసా..

For More Lifestyle News

Updated Date - Jul 04 , 2025 | 11:36 AM