Share News

Parenting Tips: పిల్లల మెదడు చురుకుగా ఉండాలంటే.. ఇలా చేయండి..

ABN , Publish Date - Jun 23 , 2025 | 05:35 PM

పిల్లల బ్రెయిన్ పవర్‌ని పెంచాలంటే ఈ టిప్స్‌ను పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Parenting Tips: పిల్లల మెదడు చురుకుగా ఉండాలంటే.. ఇలా చేయండి..
Parenting

Parenting Tips: పిల్లల ఆరోగ్య సంరక్షణ తల్లిదండ్రుల ముఖ్య బాధ్యతల్లో ఒకటి. శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. చిన్న వయస్సులోనే మెదడు ఎదుగుదలకు సహాయపడే అలవాట్లను అలవరచడం వల్ల పిల్లల జ్ఞాపకశక్తి, లెర్నింగ్ కెపాసిటీ మెరుగుపడుతుంది. పిల్లల బ్రెయిన్ పవర్‌ని పెంచాలంటే ఈ టిప్స్‌ను పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఆరోగ్యకరమైన ఆహారం

ఆరోగ్యకరమైన ఆహారం మెదడు పనితీరుకు చాలా ముఖ్యం. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం పిల్లల మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. కాబట్టి మెదడు అభివృద్ధికి పిల్లలకు అవసరమైన పోషకాలు ఉండే ఆహారం ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు, చేపలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు అందించాలి.

ఆటలు

పిల్లలు రోజూ ఆటలు ఆడటం లేదా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఇది మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఆటలు పిల్లల మెదడును ఉత్తేజితం చేస్తాయి. పజిల్స్, బ్లాక్స్, ఇతర సృజనాత్మక ఆటలు వారి ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తాయి.

చదువు:

చదవడం, రాయడం, ఇతర విద్యా కార్యకలాపాలు మెదడును చురుకుగా ఉంచుతాయి. పిల్లలతో పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం, అక్షరాలు, పదాలను నేర్పించడం ద్వారా వారి భాషా నైపుణ్యాలను మెరుగుపరచవచ్చు.


ప్రేమ, శ్రద్ధ:

పిల్లలకు ప్రేమ, శ్రద్ధ సురక్షితమైన వాతావరణం అవసరం. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వారి మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. పిల్లలతో మాట్లాడటం, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, వారి అభిప్రాయాలను వినడం కూడా మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది.

నిద్ర:

పిల్లలకు తగినంత నిద్ర అవసరం. నిద్ర మెదడుకు విశ్రాంతినిస్తుంది. వారి జ్ఞాపకశక్తి, అభ్యాస నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. పిల్లలు రోజుకు కనీసం 8-10 గంటలు నిద్రపోవాలి. నిద్ర లేనప్పుడు బ్రెయిన్ పవర్ తగ్గుతుంది. శ్రద్ధ, జ్ఞాపకశక్తి కూడా ప్రభావితమవుతుంది.

సృజనాత్మక కార్యకలాపాలు:

బొమ్మలు వేయడం, పాటలు పాడటం, ఇతర సృజనాత్మక కార్యకలాపాలు వారి సృజనాత్మకతను పెంపొందిస్తాయి.


Also Read:

ప్రేమలో ఉన్న అమ్మాయిలు ఎక్కువగా చేసే తప్పులు ఇవే.. మీరు కూడా చేస్తుంటారా..

ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోతుందా.. ఈ చిట్కాలు మీకోసం..

For More Lifestyle News

Updated Date - Jun 23 , 2025 | 05:45 PM