Share News

Hair Care Tips: షాంపూ అవసరం లేదు.. ఈ సహజమైన చిట్కాలు పాటిస్తే చాలు

ABN , Publish Date - Jun 15 , 2025 | 01:53 PM

మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సహజమైన చిట్కాలు పాటించడం మంచిది. ఎందుకంటే, ఇవి జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి సమస్యలను తగ్గిస్తాయి.

Hair Care Tips: షాంపూ అవసరం లేదు.. ఈ సహజమైన చిట్కాలు పాటిస్తే చాలు
Hair Care Tips

Hair Care Tips: మార్కెట్లో వివిధ రకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి. కొంత మంది వారానికి రెండు మూడు సార్లు షాంపూతో తలస్నానం చేస్తారు. మరి కొంత మంది రోజూ షాంపూతో తలస్నానం చేస్తారు. అయితే, ప్రతి రోజు ఇలా షాంపూ వాడటం వల్ల జుట్టు పొడిబారి రాలిపోవడం, చుండ్రు వంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి, షాంపూని వాడటానికి బదులుగా సహజంగా లభించే ఈ ఇంటి చిట్కాలతో తలస్నానం చేయడం మంచిది.


శనగపిండి

కొంత శనగపిండిని నీటిలో కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. దాన్ని జుట్టు, తలకు అప్లై చేయండి. 20-30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే మంచిది. ఇది జుట్టులోని నూనె, దుమ్ము పూర్తిగా తొలగిస్తుంది. అంతేకాకుండా ఇది జుట్టును తేలికగా, మెరిసేలా చేస్తుంది.

కలబంద జెల్

తాజా కలబంద గుజ్జును తీసుకుని తలకు రాయండి. గంట తర్వాత తలస్నానం చేయండి. కలబంద తేమ జుట్టును మృదువుగా చేస్తుంది. చుండ్రు, పొడి జుట్టు ఉన్నవారికి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది.

పెరుగు

కొంచెం పెరుగు తీసుకుని జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయడం మంచిది. పెరుగు తల చర్మాన్ని చల్లబరుస్తుంది. చుండ్రు తగ్గిస్తుంది. వారంలో 2-3 సార్లు ఇలా చేస్తే జుట్టు బాగా మెరుస్తుంది.

ఉసిరి పొడి

2 టేబుల్ స్పూన్ల ఆమ్లా పొడికి నీరు లేదా రోజ్ వాటర్ కలపండి. దానిని పేస్ట్ లాగా చేసి తలకు రాయండి. అరగంట తర్వాత తలస్నానం చేయండి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ ఇంటి చిట్కాలు సహజమైనవి కాబట్టి, మీ జుట్టుకు ఆరోగ్యంగా ఉంటుంది.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

డబ్బును ఆకర్షించడానికి ఏం చేయాలో తెలుసా..

లైట్ తీసుకోవడం కష్టమే..

For More Lifestyle News

Updated Date - Jun 15 , 2025 | 02:03 PM