Kitchen Cleaning Tips: కిచెన్‌లో పాత్రలు దుర్వాసన వస్తున్నాయా? ఒక్కసారి ఇవి ట్రై చేయండి.!
ABN , Publish Date - Nov 26 , 2025 | 01:44 PM
కిచెన్‌లో పాత్రలు కొన్నిసార్లు ఎంత శుభ్రం చేసినా, అవి దుర్వాసన వస్తుంటాయని చాలా మంది అంటుంటారు. అలాంటి వారు ఒక్కసారి ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి.!
ఇంటర్నెట్ డెస్క్: వంటగదిని శుభ్రం చేయడం చాలా కష్టం. అందులోనూ పాత్రలను శుభ్రం చేయాలంటే చాలా ఇబ్బంది. దీని కోసం సబ్బు, డిష్ వాష్ లిక్విడ్ ఉపయోగిస్తారు. నాన్-వెజ్ వండిన పాత్రలు ఎంత క్లీన్ చేసినా వాటి దుర్వాసన అలాగే ఉంటుంది. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారా? అయితే, ఒక్కసారి ఈ ఇంటి చిట్కాలు ట్రై చేసి చూడండి.
నిమ్మకాయ, ఉప్పు:
సగం నిమ్మకాయ ముక్కను తీసుకుని, దానికి కొద్దిగా ఉప్పు వేసి, పాత్రను బాగా రుద్ది 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత సబ్బుతో శుభ్రం చేయండి. ఇది పాత్ర నుండి దుర్వాసనను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
దాల్చిన చెక్క పొడి:
దుర్వాసన వస్తున్న పాత్రలో దాల్చిన చెక్క పొడి, కొద్దిగా నీరు వేసి, 15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత ఆ ద్రవంతో పాత్రను శుభ్రం చేయండి.
బంగాళాదుంప:
బంగాళాదుంపలలోని స్టార్చ్ పాత్రల నుండి దుర్వాసనలను తొలగించడానికి సహాయపడుతుంది. దీని కోసం బంగాళాదుంప ముక్కకు ఉప్పు వేసి పాత్రను బాగా రుద్ది, 10 నిమిషాల తర్వాత పాత్రను శుభ్రం చేయండి.
Also Read:
కవితపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు
ఇది సాధారణ వాషింగ్ మెషిన్ కాదు.. 999 సంవత్సరాలు పని చేయడం గ్యారెంటీ..
For More Latest News