Share News

Health insurance: ఆరోగ్య బీమా.. ప్రయోజనాలు కోల్పోకుండా వేరే కంపెనీకి ఎలా మారాలి..

ABN , Publish Date - Jun 19 , 2025 | 05:03 PM

ఈ రోజుల్లో ఆరోగ్య బీమా చాలా అవసరం. కానీ, మనకు ఉన్న పాలసీ సరిగ్గా లేదని అనిపించినప్పుడు మనం మరో మంచి ఇన్సూరెన్స్ కంపెనీకి మారాలనుకుంటాం. అయితే, ఆరోగ్య బీమా ప్రయోజనాలు కోల్పోకుండా బీమాను వేరే కంపెనీకి ఎలా మార్చుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Health insurance: ఆరోగ్య బీమా.. ప్రయోజనాలు కోల్పోకుండా వేరే కంపెనీకి ఎలా మారాలి..
Health insurance

Health insurance: ఆరోగ్య బీమా అనేది వైద్య ఖర్చుల కోసం ఆర్థిక రక్షణ కల్పించే ఒక రకమైన బీమా. దీనిలో, మీరు ఒక బీమా సంస్థకు (ఇన్సూరెన్స్ కంపెనీ) ప్రీమియం చెల్లిస్తారు. ఆ సంస్థ మీ వైద్య ఖర్చులను, లేదా కొంత భాగాన్ని కవర్ చేస్తుంది. సాధారణంగా, ఆరోగ్య బీమాలో ఆసుపత్రిలో చేరడం, వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు, మందుల ఖర్చులు, ఇతర వైద్య సంబంధిత ఖర్చులు ఉంటాయి. మీరు బీమా చేసిన మొత్తానికి లోబడి ఈ ఖర్చులు కవర్ అవుతాయి. ఈ రోజుల్లో ఆరోగ్య బీమా చాలా అవసరం. కానీ, మనకు ఉన్న పాలసీ సరిగ్గా లేదని అనిపించినప్పుడు మనం మరో మంచి ఇన్సూరెన్స్ కంపెనీకి మారాలనుకుంటాం. అయితే, ఆరోగ్య బీమా ప్రయోజనాలు కోల్పోకుండా ఆరోగ్య బీమాను వేరే కంపెనీకి ఎలా మార్చుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


మీరు ఆరోగ్య బీమాను వేరే కంపెనీకి మార్చుకోవాలని అనుకున్నప్పుడు బీమా పోర్టింగ్ అనే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక బీమా కంపెనీ నుంచీ ఇంకొక బీమా కంపెనీకి మారడం. ఇది పూర్తిగా చట్టబద్ధమైనది. భారత ప్రభుత్వానికి చెందిన బీమా నియంత్రణ సంస్థ IRDAI దీనిని అనుమతిస్తుంది.

బీమా పోర్టింగ్

ఆరోగ్య బీమా పాలసీని మరొక కంపెనీకి మార్చడాన్ని బీమా పోర్టింగ్ అంటారు. ఇది పాలసీ గడువు తేదీకి కనీసం 45 రోజుల ముందు చేయాలి. మీరు మీ ప్రస్తుత బీమా సంస్థ ప్రయోజనాలు సరిగ్గా లేవని అనుకుంటే లేదా మెరుగైన సేవలు లేదా తక్కువ ప్రీమియంలు కోరుకుంటే బీమా పోర్టింగ్ చేయవచ్చు.

  • ముందుగా ఆరోగ్య బీమా ప్లాన్‌‌ను ఒకసారి చెక్ చేయండి

  • మీ అవసరాలకు అనుగుణంగా ఉన్న మంచి బీమా కంపెనీని ఎంచుకోండి.

  • పోర్టబిలిటీ దరఖాస్తు ఫాం ఫిల్ చేయండి

  • కొత్త బీమా కంపెనీకి ప్రపోజల్ ఫామ్ ఇవ్వండి

  • మీ గత క్లెయిమ్‌లు, ఆరోగ్య పరిస్థితుల వివరాలు స్పష్టంగా పేర్కొనాలి

  • కొత్త బీమా కంపెనీ గురించి బాగా తెలుసుకోండి

  • వారు మీ దరఖాస్తును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. లేదంటే కొన్ని నిబంధనలతో ఆమోదించవచ్చు.


పోర్టింగ్ చేసేటప్పుడు కలిగే ప్రయోజనాలు

  • వెయిటింగ్ పీరియడ్ ముందున్న విధంగా కొనసాగుతుంది

  • నో క్లెయిమ్ బోనస్, అడిషనల్ కవరేజ్ వంటివి కొనసాగుతాయి

  • కొత్త పాలసీకి వెళ్లినా, మీరు మీ పాత పాలసీ ప్రయోజనాలు కోల్పోరు

  • బీమా పోర్టింగ్ ద్వారా మీరు మీ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా మంచి పాలసీకి మారొచ్చు


Also Read:

FD పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఈ చిన్న బ్యాంకుల్లో 8 శాతం వరకు వడ్డీ..

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

For More Lifestyle News

Updated Date - Jun 19 , 2025 | 05:32 PM