Share News

EPFO Regulation Change: తక్కువ జీతం ఉన్నవారికి శుభవార్త! ఈ రెండు నియమాలు మీకు తెలుసా?

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:43 AM

ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది. ఈ మార్పుల ద్వారా, EDLI పథకం కింద లభించే బీమా మొత్తం పెరిగింది. మరణించిన ఉద్యోగి కుటుంబానికి మరింత ఆర్థిక సహాయం అందించనుంది.

EPFO Regulation Change: తక్కువ జీతం ఉన్నవారికి శుభవార్త! ఈ రెండు నియమాలు మీకు తెలుసా?
EPFO

ఇంటర్నెట్ డెస్క్‌: కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ EPFO (ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ( EDLI ) స్కీమ్ నిబంధనలలో కీలక మార్పులు చేసింది. ఇది లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు, ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నప్పుడు మరణించిన సభ్యుల కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. తక్కువ జీతం ఉన్న రంగంలో పనిచేస్తున్న వారికి, ఇతర బీమా రక్షణ లేని వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. క్లిష్ట సమయాల్లో ఉద్యోగులు డబ్బు ఆదా చేసుకునే అవకాశం పొందడమే కాకుండా వారి కుటుంబాలు కూడా ఆర్థిక సహాయం పొందేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.


ఉద్యోగి కుటుంబానికి రూ. 50,000 బీమా సౌకర్యం

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఇప్పుడు ఏ ఉద్యోగి అయినా పిఎఫ్ బ్యాలెన్స్ ఖాతాలో రూ. 50,000 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ, అతను మరణించినప్పటికీ అతని కుటుంబానికి కనీసం రూ. 50,000 బీమా ప్రయోజనం లభిస్తుంది. ఓ నివేదిక ప్రకారం, గతంలో ఈ ప్రయోజనం పొందడానికి, ఉద్యోగి తన ఖాతాలో నిర్దేశించిన పరిమితి వరకు బ్యాలెన్స్ కలిగి ఉండటం అవసరం, కానీ ఇప్పుడు ఈ షరతు తీసేశారు.

ఉద్యోగాల మధ్య గ్యాప్ ఉన్నా బీమా ప్రయోజనం

ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకంలో మరో ముఖ్యమైన మార్పు కూడా చేశారు. ఇప్పటివరకు, బీమా ప్రయోజనం పొందాలంటే 12 నెలల నిరంతర సేవ అవసరం ఉండేది. కానీ ఇప్పుడు, ఉద్యోగాల మధ్య 60 రోజుల గ్యాప్ ఉన్నా, అది సేవలో విరామంగా పరిగణించరాదు అని నిర్ణయించారు. అంటే, మీరు ఒక ఉద్యోగం మానేసి మరొక ఉద్యోగం చేపట్టేలోగా 2 నెలలలోపు ఉంటే, ఆ రెండు ఉద్యోగాల సర్వీస్‌ కలిపి నిరంతర సేవగా పరిగణిస్తారు. దాంతో, మీరు EDLI పథకం కింద పూర్తి బీమా ప్రయోజనాన్ని పొందగలుగుతారు.


ఉద్యోగి మరణించినా.. 6 నెలల్లోపు..

ఒక ఉద్యోగి పీఎఫ్ పథకంలో సభ్యుడిగా ఉంటే (అది సాధారణ పీఎఫ్ అయినా, లేక సెక్షన్ 17 కింద మినహాయింపు పొందిన పీఎఫ్ అయినా), పీఎఫ్ కంట్రిబ్యూషన్ వచ్చిన తర్వాత ఆరు నెలల లోపు అతను మరణించినప్పటికీ, ఆయన కుటుంబానికి ఈ బీమా ప్రయోజనం అందుతుంది. ఇది కుటుంబానికి ఆర్థికంగా కొంత భద్రతను కల్పిస్తుంది. ఈ మార్పుతో అనేక కుటుంబాలకు అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంది.

కుటుంబంలో సంపాదన కలిగిన సభ్యుడు మరణించినప్పుడు, అటువంటి దురదృష్టకర పరిస్థితిలో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం EPFOకు సంబంధించిన EDLI పథకం లక్ష్యం. ఇది ఉద్యోగులకు మనశ్శాంతిని, వారి కుటుంబాలకు భద్రతను ఇస్తుంది. వారు ప్రత్యేక బీమా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.

నామినీ పేరు చేర్చబడకపోతే

పిఎఫ్ ఖాతాదారుడు తన ఖాతాలో నామినీ పేరును ఇవ్వకపోతే, అతను మరణిస్తే, పిఎఫ్ మొత్తాన్ని అతని చట్టపరమైన వారసుడికి అందిస్తారు. దీని కోసం, వారసుడు తన గుర్తింపు, హక్కులను నిర్ధారించుకోవడానికి తన ఆధార్ కార్డు, ఇతర అవసరమైన పత్రాలను సమర్పించాలి.


Also Read:

ఈ తినే నియమాలు మీకు తెలుసా? ఇలా తింటే ఆయుష్షు తగ్గుతుంది.!

ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు ప్రయాణించాలని అనుకుంటున్నారా? ఇలా ప్లాన్ చేసుకోండి.!

For More Lifestyle News

Updated Date - Jul 19 , 2025 | 12:15 PM