Pan Card: పాన్ కార్డుకు ఎక్స్‌పైరీ డేట్ ఉందా.. ఈ కీలక విషయం తెలుసుకోండి..
ABN , Publish Date - Jun 27 , 2025 | 01:02 PM
ప్రతి ఒక్కరికి పాన్ కార్డు తప్పకుండా ఉంటుంది. అయితే, పాన్ కార్డు గడువు ఎన్నేళ్లు? పాన్ కార్డు ఒక్కసారి తీసుకుంటే జీవితాంతం చెల్లుబాటు అవుతుందా? ఈ విషయంపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తోందో తెలుసుకుందాం..

PAN Card: పాన్ కార్డు (Permanent Account Number - PAN Card) అనేది ఆదాయపు పన్ను శాఖ ద్వారా జారీ చేయబడిన 10-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది భారతదేశంలోని పన్ను చెల్లింపుదారులందరికీ కేటాయిస్తారు. ఇది ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వ్యక్తి లేదా సంస్థను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఇది బ్యాంకు ఖాతాలు తెరవడం, ఆస్తులు కొనుగోలు చేయడం వంటి అనేక ఆర్థిక కార్యకలాపాలకు అవసరం.
పాన్ కార్డు పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇది ఆదాయపు పన్ను శాఖ ద్వారా జారీ చేయబడిన అధికారిక గుర్తింపు పత్రం. ఒక వ్యక్తి లేదా సంస్థకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. పాన్ కార్డు రుణాల కోసం దరఖాస్తు చేయడానికి, క్రెడిట్ కార్డులను పొందడానికి కూడా పాన్ కార్టు అవసరం ఉంటుంది.
పాన్ కార్డు జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. పాన్ కార్డు జారీ చేసిన తర్వాత దానిని జీవితాంతం ఉపయోగించవచ్చు. కొత్త కార్డు తీసుకోవలసిన అవసరం లేదు. ఒకవేళ పాన్ కార్డు పోయినట్లయితే దాన్ని తిరిగి పొందడానికి మీరు డూప్లికేట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, పాన్ నంబర్ అస్సలు మారదు.
ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డు మాత్రమే ఉండాలి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272B ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉంటే 10,000 రూపాయల జరిమానా ఉంటుంది. మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే, వాటిని రద్దు చేయడానికి మీరు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో లేదా సమీపంలోని NSDL సెంటర్‌లో సరెండర్ చేసేయాలి.
Also Read:
ఖర్చులు ఎక్కువైయ్యాయా.. ఈ మ్యాజిక్ ఫార్ములా పాటిస్తే జేబులో ఎప్పుడూ డబ్బే..!
రోజూ సంపాదిస్తున్నా రూపాయి కూడా మిగలడం లేదా.. ఈ అలవాట్లే కారణం..
For More Lifestyle News