Vitamin D Deficiency: సన్‌స్క్రీన్ అప్లై చేయడం వల్ల శరీరంలో విటమిన్ డి తగ్గుతుందా..
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:51 AM
చాలా మంది చర్మ సంరక్షణ కోసం సన్‌స్క్రీన్ అప్లై చేస్తారు. అయితే, సన్‌స్క్రీన్ అప్లై చేయడం వల్ల శరీరంలో విటమిన్ డి తగ్గుతుందా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Vitamin D Deficiency: సూర్యుని బలమైన, హానికరమైన కిరణాల నుండి సన్‌స్క్రీన్ మన చర్మాన్ని రక్షిస్తుందని మనందరికీ తెలుసు. కానీ, ప్రతిరోజూ సన్‌స్క్రీన్ అప్లై చేయడం మంచిదేనా? వాస్తవానికి, విటమిన్ డి ని 'సన్‌షైన్ విటమిన్' అని పిలుస్తారు. ఎందుకంటే ఇది సూర్యకాంతి మన చర్మంపై పడినప్పుడు మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఈ విటమిన్ మన ఎముకలను బలంగా చేస్తుంది. అయితే, సన్‌స్క్రీన్ అప్లై చేయడం వల్ల విటమిన్ డి లభించదని కొంతమంది అంటారు. అయితే, ఇందులో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరం విటమిన్ డిని ఎలా తయారు చేసుకుంటుంది?
సూర్యకాంతి, ముఖ్యంగా UVB కిరణాలు మన చర్మంపై పడినప్పుడు మన శరీరం దానంతట అదే విటమిన్ D ని ఉత్పత్తి చేస్తుంది. ఇలా మనకు విటమిన్ D లభిస్తుంది. కానీ, సన్‌స్క్రీన్ పూసుకుంటే మన శరీరం విటమిన్ Dని ఉత్పత్తి చేయలేకపోవచ్చు అని కొంతమంది భావిస్తారు. నిపుణుల ప్రకారం, ఒక వ్యక్తి అధిక సన్‌స్క్రీన్‌ను అప్లై చేస్తే అవి సూర్య కిరణాలను కొద్దిగా అడ్డుకుంటాయి. కానీ, విటమిన్ డి ఉత్పత్తిని పూర్తిగా ఆపవు.
మీ శరీరంలో విటమిన్ డి లోపం ఉందని మీరు భావిస్తే సన్‌స్క్రీన్ అప్లై చేయడం మానేయాల్సిన అవసరం లేదు. మీరు సన్‌స్క్రీన్ అప్లై చేయకుండా ప్రతిరోజూ తేలికపాటి ఉదయం ఎండలో కొద్దిసేపు (సుమారు 10 నుండి 15 నిమిషాలు) గడపవచ్చు. ఉదయం సమయం మంచిది ఎందుకంటే అప్పుడు సూర్య కిరణాలు అంత బలంగా ఉండవు. మీ చర్మం కూడా సురక్షితంగా ఉంటుంది.
శరీరంలో విటమిన్ డి ని ఎలా పెంచుకోవాలి?
సూర్యరశ్మితో పాటు మీ ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం ద్వారా కూడా మీరు విటమిన్ డి పొందవచ్చు. గుడ్లు, కొవ్వు చేపలు (సాల్మన్ వంటివి), పాలు, తృణధాన్యాలు వంటి కొన్ని ఆహారాలలో విటమిన్ డి కనిపిస్తుంది. దీనితో పాటు, చాలా మంది విటమిన్ డి మాత్రలు లేదా సప్లిమెంట్లను కూడా తీసుకుంటారు. తద్వారా వారి శరీరానికి అవసరమైన మొత్తంలో విటమిన్ డి లభిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
మీ కిడ్నీ సరిగ్గా పనిచేస్తుందా లేదా? ప్రతిరోజూ ఇంట్లో ఇలా చెక్ చేసుకోండి..
రోజూకు రెండు గుడ్లు తింటే ఏం జరుగుతుంది..
For More Lifestyle News