Chef: స్టార్ హోటళ్లలో చెఫ్‌లు పొడవైన టోపీని ఎందుకు ధరిస్తారో తెలుసా..
ABN , Publish Date - May 26 , 2025 | 06:17 PM
స్టార్ హోటళ్లలో చెఫ్‌లు పొడవైన టోపీని ధరించడం మీరు చూసి ఉంటారు. అయితే, వారు అలా ఎందుకు ధరిస్తారో తెలుసా? ఆ టోపీని ఏమని పిలుస్తారు ? వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో చెఫ్‌లు చాలా డిఫరెంట్‌గా కనిపిస్తారు. తెల్లటి బట్టలు ధరించి, తలపై పొడవాటి టోపీ ధరించి చెఫ్‌లు వంట చేయడం మనం చూసి ఉంటాం. చెఫ్‌లు అంత పొడవైన టోపీని ఎందుకు ధరిస్తారో తెలియక ఆశ్చర్యపోతాం. అయితే, వారు అలా ఎందుకు ధరిస్తారో తెలుసా? ఆ టోపీని ఏమని పిలుస్తారు? వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
టోక్యూ
వంటవాళ్లు ధరించే ఈ తెల్లటి టోపీని టోక్యూ లేదా టోక్యూ బ్లాంచ్ అంటారు. ఇది ఫ్రెంచ్ భాష నుండి వచ్చిన పదం. టోక్ అంటే తల కప్పుకోవడం. కొన్ని చెఫ్ టోపీలు పొడవుగా ఉంటాయి. మరికొన్ని చిన్నగా ఉంటాయి. చెఫ్‌లు ధరించే ఈ పొడవైన టోపీ హోటల్‌లో వారి బాధ్యతను సూచిస్తుంది. అనేక స్టార్ హోటళ్లలో, చెఫ్ టోపీ అతని స్థానాన్ని సూచిస్తుంది.
పరిశుభ్రత
టోక్ బ్లాంచ్ ధరించే ఆచారం 18వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో వచ్చింది. సెలబ్రిటీ చెఫ్ మేరీ-ఆంటోయిన్ కారెమ్ చెఫ్ టోక్, క్లాసిక్ వైట్ చెఫ్ కోటును మొట్టమొదటి సారి ధరించారని తెలుస్తోంది. వంటగది పరిశుభ్రత కోసం తెల్లని దుస్తులు ధరించారు. ఈ టోపీలకు చక్కని నిర్మాణాన్ని ఇవ్వడానికి కార్డ్‌బోర్డ్‌ను ఉపయోగిస్తారు. హోటల్‌లో పనిచేసే అత్యంత సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెఫ్‌లు సాధారణంగా ఎత్తుగా ఉన్న టోక్యూ ధరిస్తారు. దిగువ స్థాయి వారు అతి చిన్న టోక్యూ ధరిస్తారు. 100 మడతలు కలిగిన టోక్ అంటే గుడ్డు వండడానికి 100 రకాలుగా తెలిసిన వంటవాడిని సూచిస్తుంది.
చెఫ్స్ టోక్‌తో ప్రయోజనాలు
ఈ చెఫ్ టోక్ ఆహార భద్రతా ప్రమాణాలను కాపాడుతూ, జుట్టు ఆహారంలో పడకుండా చేస్తుంది. అవి తల నుండి చెమటను పీల్చుకుంటాయి. వాటి నిర్మాణం తలకు బాగా గాలి వచ్చేలా సహాయపడుతుంది. అన్నింటికంటే మించి, చెఫ్ యూనిఫాం వృత్తిపరమైన క్రమశిక్షణకు దోహదపడుతుంది.
Also Read:
ఈ హాబీలు యువకుల జీవితాలను నాశనం చేస్తాయి..
బోటు బోల్తా.. సముద్రంలో గంగూలీ సోదరుడి కుటుంబం..!
For More National News