Diwali Injury Prevention Tips: దీపావళి క్రాకర్స్ కాల్చడం వల్ల చేతులు, కాళ్లకు గాయాలయ్యాయా? ఇలా చేయండి..
ABN , Publish Date - Oct 21 , 2025 | 04:11 PM
దీపావళి క్రాకర్స్ కాల్చడం వల్ల మీ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయా? అయితే, ఈ సింపుల్ టిప్స్ మీకు ఉపశమనం కలిగిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి అంటేనే క్రాకర్స్.. పండుగ రెండు రోజుల ముందు నుంచే ప్రజలు బాణాసంచా కాలుస్తూ సంబురాలు జరుపుకుంటారు. అయితే, క్రాకర్స్ కాల్చడం అటుంచితే.. ఈ క్రాకర్స్ కారణంగా గాయపడిన వారి సంఖ్య చాలానే ఉంటుంది. బాంబులు కాల్చే క్రమంలో నిర్లక్ష్యం కారణంగా చాలా మంది తీవ్రంగా గాయపడిన సందర్భాలు ఉన్నాయి. మీరు కూడా క్రాకర్స్ కారణంగా గాయపడ్డారు. మీ గాయం త్వరగా మానేందుకు అద్భుతమైన చిట్కాలు అందిస్తున్నాం. మరి ఆ చిట్కాలేంటో ఈ కథనంలో చూసేయండి..
చల్లని నీటితో కడగాలి:
మీ చేతులు లేదా కాళ్ళు కాలిపోతే, వెంటనే కాలిన ప్రాంతాన్ని సుమారు 10-15 నిమిషాల పాటు చల్లని నీటిలో ఉంచండి. ఇది నొప్పిని తగ్గిస్తుంది. గాయం నుండి ఉపశమనం ఇస్తుంది. నీరు చాలా వేడిగా లేదా చల్లగా ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది మీ చర్మాన్ని దెబ్బతీస్తుంది.
నేరుగా ఐస్ పెట్టకండి:
చాలా మంది గాయాలు అయిన వెంటనే త్వరగా ఉపశమనం కోసం ఐస్ పెడతారు, కానీ ఇలా చేయడం మంచిది కాదు. చర్మానికి నేరుగా ఐస్ పెట్టడం వల్ల చర్మం పగుళ్లు లేదా వాపుకు కారణమవుతుంది. చల్లటి నీటితో తేలికపాటి కంప్రెస్ వేయండి. వైద్యుడు సలహా ఇస్తేనే ఐస్ వాడండి.
టూత్‌పేస్ట్ అప్లై చేయకండి
కొంతమంది గాయాలకు టూత్‌పేస్ట్ పెట్టడం వల్ల మంట తగ్గుతుందని అనుకుంటారు, కానీ ఇది ఒక అపోహ మాత్రమే. టూత్‌పేస్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. బదులుగా, కాలిన గాయాన్ని శుభ్రమైన గుడ్డతో తుడిచి, వైద్యుడు సిఫార్సు చేసిన విధంగా యాంటీబయాటిక్ క్రీమ్‌ను రాయండి.
చేతులకు చిన్న గాయమైతే ఇంట్లోనే ఆయింట్‌మెంట్, బ్యాండేజ్‌తో చికిత్స చేయవచ్చు. పాదం, ముఖం లేదా శరీరంలో ఎక్కువ భాగం కాలితే, వెంటనే వైద్యుల సహాయం తీసుకోండి. చల్లటి నీటితో గాయాలను బాగా శుభ్రం చేసుకుని, తర్వాత ఆసుపత్రికి వెళ్లండి. ఆలస్యం చేయడం వల్ల నష్టం మరింత తీవ్రమవుతుంది.
(Note: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి..
పోలీసుల పని తీరును తప్పక కొనియాడాల్సిందే: విశాఖ సీపీ
Yarapathineni Slams Jagan: ఆ భూతం లేకపోవడంతో రెట్టింపు ఉత్సహంతో దీపావళి వేడుకలు..
Read Latest AP News And Telugu News