Chanakya Niti: భార్యాభర్తలు కలిసి ఈ పనులు అస్సలు చేయకూడదు..
ABN , Publish Date - Jun 25 , 2025 | 04:15 PM
ఆచార్య చాణక్యుడు దాంపత్య జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చాలా చక్కగా వివరించారు. అయితే, భార్య భర్తలు కలిసి ఈ పనులు అస్సలు చేయకూడదని చాణక్య చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తన చాణక్య నీతిలో చాలా చక్కగా వివరించారు. చాణక్యుడు చెప్పిన విషయాలను చాలా మంది ఇప్పటికీ కూడా పాటిస్తున్నారు. ఆయన సూచనలు అనేక సమస్యల నుండి బయటపడేలా చేస్తాయి. అలాగే, దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాలను కూడా చాణక్య నీతి శాస్త్రంలో ప్రస్తావించారు. అయితే, భార్యాభర్తలు కలిసి ఈ పనులు అస్సలు చేయకూడదని చాణక్య చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆచార్య చాణక్యుడి ప్రకారం, భార్యాభర్తలు కలిసి ఒకేసారి ధ్యానం చేయడం మంచిది కాదు. ఎందుకంటే, వారు అలా చేస్తే పరధ్యానంలో పడతారు. కాబట్టి, ఎప్పుడూ కూడా ఇద్దరూ కలిసి ధ్యానం చేయకూడదని చాణక్యుడు చెబుతున్నారు. అలా కాకుండా, విడివిడిగా ధ్యానం చేసుకోవాలని సూచిస్తున్నారు. అలానే, భార్యాభర్తలిద్దరూ కలిసి చదువుకోవడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. శ్రద్ధగా చదువుకోవాలంటే ఇద్దరు వేరువేరుగా కూర్చుని చదువుకోవాలని సూచిస్తున్నారు.
అదే విధంగా, స్త్రీ పురుషులు ఒకరి ముందు ఒకరు బట్టలు మార్చుకోకూడదని చెబుతున్నారు. బట్టలు మార్చుకోవడం లేదంటే బట్టలు సరి చేసుకునే స్త్రీని పురుషులు చూడడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. కాబట్టి, భార్యాభర్తలు కలిసి ఈ పనులు అస్సలు చేయకూడదని చాణక్యుడు సూచిస్తున్నారు. కావాలంటే, విడివిడిగా ఈ పనులు చేసుకోవాలని కానీ, ఒకేసారి ఈ పనులు చేసుకోవడం మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నారు.
Also Read:
బద్దకానికి కారణమయ్యే ఆహారాలు ఇవే..
టాటూ ఉన్న వాళ్లు రక్తదానం చేయడం మంచిదేనా..
For More Lifestyle News