Baking Soda Vs Baking Powder: బేకింగ్ సోడా Vs బేకింగ్ పౌడర్.. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి?
ABN , Publish Date - Aug 01 , 2025 | 09:08 AM
బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండూ తెల్లటి పౌడర్లు అయినప్పటికీ, వాటిలో చాలా తేడాలు ఉన్నాయి. అయితే, ఆ తేడాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: వంటకాల్లో కేక్‌లు, కుకీలనుగా తయారు చేయాలంటే బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ వాడుతాం. ఇవి రెండు తెల్లటి పౌడర్లలాగే కనిపిస్తాయి కానీ, అవి ఎలా పనిచేస్తాయో, ఎప్పుడు వాడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాటిని తప్పుగా వాడితే మీరు చేయాలనుకునే వంట నాశనమవుతుంది. కేక్ బాగా పైకి రాదు లేదా వింతగా రుచి వస్తుంది. కాబట్టి, ఆ రెండింటిని ఎలా వాడాలి? వాటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బేకింగ్ సోడా
బేకింగ్ సోడా అనేది, రసాయన శాస్త్రంలో సోడియం బైకార్బోనేట్ అని పిలిచే ఒక తెల్లటి పొడి. దీనిని సాధారణంగా వంటలలో పులియబెట్టే పదార్థంగా ఉపయోగిస్తారు. ఇది ఒక క్షార పదార్థం. ఇది కొన్ని ఆహార పదార్థాలలోని ఆమ్లాలతో కలిసినప్పుడు కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది.
బేకింగ్ సోడాను ఎలా పని చేస్తుంది?
బేకింగ్ సోడాను కేకులు, రొట్టెలు, కుకీలు వంటి బేకరీ వస్తువులను తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ఇది ఆమ్ల పదార్థాలతో కలిసినప్పుడు కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేసి, పిండిని ఉబ్బేలా చేస్తుంది. బేకింగ్ సోడాను సహజమైన శుభ్రపరిచే పదార్థంగా కూడా ఉపయోగించవచ్చు. ఇది వాసనలను గ్రహించడానికి, గిన్నెలు, ఇతర వస్తువులను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది గుండెల్లో మంట, ఇతర జీర్ణ సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.
బేకింగ్ పౌడర్
బేకింగ్ పౌడర్ అనేది ఒక పులియబెట్టే పదార్థం. ఇది కేకులు, ఇతర కాల్చిన ఆహార వస్తువులను చేయడానికి ఉపయోగిస్తారు. ఇది బేకింగ్ సోడా, ఇంకా ఒక ఆమ్లం కలయిక. దీనిని సాధారణంగా క్రీమ్ ఆఫ్ టార్టార్. ఈ రెండు పదార్థాలు కలిసి తేమ, వేడితో చర్య జరిపి కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తాయి.
బేకింగ్ పౌడర్ ఎలా పని చేస్తుంది?
బేకింగ్ పౌడర్ లోని ఆమ్లం, బేకింగ్ సోడాతో కలిసి, వేడి లేదా తేమతో కలిసినప్పుడు రసాయన చర్య జరుపుతుంది. ఈ చర్య కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది. విడుదలైన ఈ వాయువు వలన బేకరీ పదార్ధాలు తయారుచేసే పిండి వంటలు మెత్తగా, తేలికగా ఉంటాయి.
బేకింగ్ సోడా Vs బేకింగ్ పౌడర్
బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండు పులియబెట్టే పదార్థాలు అయినప్పటికీ, అవి వేర్వేరు పదార్థాలతో తయారు చేయబడతాయి. వేర్వేరు ఉపయోగాలను కలిగి ఉంటాయి. బేకింగ్ సోడా అనేది స్వచ్ఛమైన సోడియం బైకార్బొనేట్. ఇది పని చేయాలంటే బట్టర్‌మిల్క్, నిమ్మరసం, పెరుగు వంటి ఆమ్ల పదార్థం అవసరం. బేకింగ్ పౌడర్ అనేది బేకింగ్ సోడా, పొడి ఆమ్లం, కార్న్ స్టార్చ్ మిశ్రమం. ఇది తేమ లేదా ద్రవం తగిలినప్పుడే స్వయంగా పనిచేస్తుంది. ఇందులో ఆమ్ల పదార్థం ముందే కలిపి ఉంటుంది కాబట్టి అదనంగా ఏమీ అవసరం లేదు.
ఇవి కూడా చదవండి:
న్యూరోసర్జన్ల హెచ్చరిక.. ఈ ఫుడ్స్ తింటే మీ బ్రెయిన్ ఖతం
తెల్లవారుజామున 3 - 5 గంటల మధ్య మెళకువ వచ్చేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
For More Health News