Bacteria on Household Items: వామ్మో.. టాయిలెట్ సీటు కంటే వీటిపై బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుందా..!
ABN , Publish Date - Nov 24 , 2025 | 08:23 PM
టాయిలెట్ సీట్‌పై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ, మనం ప్రతిరోజూ ఉపయోగించే ఈ వస్తువులపై టాయిలెట్ సీట్‌పై ఉన్న బ్యాక్టీరియా కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: టాయిలెట్ సీట్‌పై సాధారణంగా బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుందని మనకు తెలిసిందే. అయితే, దీని కంటే ఎక్కువగా ఈ వస్తువులపై బ్యాక్టీరియా ఉంటుందని మీకు తెలుసా? వీటి గురించి వీలైనంత ఎక్కువగా శ్రద్ధ వహించాలి, లేదంటే బ్యాక్టీరియా వల్ల వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొబైల్ ఫోన్లు:
మనం ఒక్క క్షణం కూడా వదిలిపెట్టని మన స్మార్ట్‌ఫోన్‌లలో టాయిలెట్ సీటు కంటే 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా స్క్రీన్ క్లీనింగ్ ద్రావణాన్ని ఉపయోగించి సున్నితంగా తుడవండి.
టీవీ రిమోట్:
తరచుగా తాకే రిమోట్ టాయిలెట్ సీటు కంటే 15 రెట్లు మురికిగా ఉంటుంది. కాబట్టి, ప్రతిరోజూ దాని శుభ్రతపై శ్రద్ధ వహించండి.
వాటర్ బాటిల్ :
బాటిల్ లోపల తేమతో కూడిన వాతావరణం బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి, బాటిల్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే అది కడుపు, పేగు వ్యాధులకు దారితీస్తుంది.
పిల్లో కవర్స్ :
పిల్లో కవర్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. ఎందుకంటే తలపై నూనె, చెమట, దుమ్ము పిల్లో కవర్‌పై బ్యాక్టీరియాకు కారణమవుతుంది.
కిచెన్ స్పాంజ్:
పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే స్పాంజ్‌పై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, వారానికి ఒకసారి స్పాంజ్‌ను మార్చండి.
Also Read:
కవితపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు
ఇది సాధారణ వాషింగ్ మెషిన్ కాదు.. 999 సంవత్సరాలు పని చేయడం గ్యారెంటీ..
For More Latest News