Breast Milk: చనుబాలు అమ్మి లక్షలు సంపాదిస్తున్న మహిళ..
ABN , Publish Date - Jul 30 , 2025 | 02:34 PM
Breast Milk: అమెరికాకు చెందిన ఇమిలీ ప్రతీ రోజూ 100 ఔన్సుల మేర అధికంగా ఉత్పత్తి అవుతున్న తన చనుబాలను అమ్ముతోంది. దీంతో ప్రతీ నెలా ఆమెకు 87 వేల రూపాయలు వస్తున్నాయి. సంవత్సరానికి 10 లక్షలు పైనే సంపాదిస్తోంది.

ప్రతీ స్త్రీ జీవితంలో తల్లిగా మారే దశ ఓ వరంలాంటిది. అదో మధురానుభూతి. కాన్పు వరకు పడ్డ అన్ని కష్టాలను.. బిడ్డను చూసుకుని మరిచిపోతుంది తల్లి. తన చనుబాలతో బిడ్డ కడుపునింపి ఎంతో సంతోషపడిపోతుంది. అయితే, తల్లిగా మారిన ప్రతీ మహిళకు చనుబాలు రావు. అనేక కారణాల వల్ల కొంతమందిలో చనుబాలు అస్సలు రాకపోగా.. మరికొంతమందిలో అతి తక్కువ మొత్తంలో మాత్రమే వస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో పశువుల పాలు లేదా డబ్బా పాలు తాపించాల్సి వస్తుంది.
తల్లుల్లో అసలు పాలు రాకపోవటం.. తక్కువ పాలు రావటం వంటి సమస్యలే కాకుండా సాధారణం కంటే ఎక్కువ పాలు రావటం కూడా మహిళల్ని వేధిస్తూ ఉంటుంది. అయితే, ఓ మహిళ అధికంగా ఉత్పత్తి అవుతున్న చనుబాలను అమ్ముతూ నెలకు వేల రూపాయలు సంపాదిస్తోంది. అమెరికా, మిన్నిసోటాకు చెందిన 33 ఏళ్ల ఇమిలీ ఎంజర్ కొన్ని రోజుల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె హైపర్ లాక్టేషన్ సమస్యతో బాధపడుతోంది. ఈ సమస్యలో చనుబాలు అవసరానికి మించి ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి.
ఇది తల్లికి, బిడ్డకు మంచిది కాదు. అందుకే ఇమిలీ ఓ ఆలోచన చేసింది. ప్రతీ రోజూ 100 ఔన్సుల మేర అధికంగా ఉత్పత్తి అవుతున్న తన చనుబాలను అమ్ముతోంది. దీంతో ప్రతీ నెలా ఆమెకు 87 వేల రూపాయలు వస్తున్నాయి. సంవత్సరానికి 10 లక్షలు పైనే సంపాదిస్తోంది. పాలను అమ్మడానికి సోషల్ మీడియాను వాడుకుంటోంది. ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతోంది. అవసరమైన వాళ్లు ఫేస్‌బుక్ ద్వారా ఆమెను సంప్రదిస్తున్నారు. కేవలం చిన్న పిల్లల తల్లిదండ్రులు మాత్రమే కాకుండా.. పిల్లలు లేని వారు కూడా ఆమె పాలను కొంటున్నారు. ఇక, చనుబాలు అమ్మటంపై ఇమిలీ మాట్లాడుతూ..‘చనుబాలలో అద్భుతమైన మంచి పోషకాలు ఉన్నాయి. అవి ఏ వయసు వారికైనా ఉపయోగకరమే’ అని అంటోంది.
ఇవి కూడా చదవండి
ప్రకాశ్‌రాజ్‌ను విచారిస్తున్న ఈడీ.. వెలుగులోకి సంచలన విషయాలు
ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమ వ్యవహారం.. ఏం జరిగిందో తెలిస్తే..