Share News

Pak Train Hijack Taliban: పాక్ రైలు హైజాకింగ్.. తాలిబాన్ల కీలక ప్రకటన

ABN , Publish Date - Mar 13 , 2025 | 09:22 PM

పాక్ రైలు హైజాకింగ్‌లో తమ పాత్ర లేదని తాలిబాన్లు స్పష్టం చేశారు. పాక్ ఆర్మీ చేసిన ఆరోపణలు తోసి పుచ్చారు. ఈ అర్ధరహిత ఆరోపణను మాని పాక్ ప్రభుత్వం తమ అంతర్గత సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అన్నారు.

Pak Train Hijack Taliban: పాక్ రైలు హైజాకింగ్.. తాలిబాన్ల కీలక ప్రకటన

ఇంటర్నెట్ డెస్క్: బలోచిస్థాన్‌లో రైలు హైజాకింగ్ వెనక ఆఫ్ఘన్ మిలిటెంట్ల హస్తం ఉందంటూ పాక్ ఆర్మీ చేసిన ఆరోపణలను తాలిబన్లు తోసిపుచ్చారు. ‘పాక్ ఆర్మీ ప్రతినిధి చేసిన నిరాధార ఆరోపణలను మేము నిర్దద్వంగా తోసి పుచ్చుతున్నాము. ఇలాంటి బాధ్యతారహిత ఆరోపణలు చేసే బదులు పాక్ తన అంతర్గత, భద్రతా సంబంధిత సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము’’ అని ఆప్ఘన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అబ్దుల్ ఖహార్ బాల్కీ పేర్కొన్నారు. హైజాకింగ్ వెనక ఆఫ్ఘాన్ లిడర్ల పాత్ర ఉన్నట్టు తమకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందని పాక్ పేర్కొంది.


Fraud: అమెరికాలో ఎంబసీ పేరుతో వచ్చే కాల్స్‌తో జాగ్రత్త!

మంగళవారం కెట్టా నుంచి పెషావర్ వెళుతున్న జాఫర్ ఎక్స్‌‌ప్రెస్ రైలును కొందరు వేర్పాటువాదులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తామే ఈ హైజాకింగ్‌కు పాల్పడ్డామని బలోచిస్థాన్ వేర్పాటువాద సంస్థ బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది.

ఇదెలా ఉంటే, హైజాక్ అయిన రైలును తాము స్వాధీనంలోకి తీసుకున్నామని పాక్ ఆర్మీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆపరేషన్ ముగిసిందని, హైజాకింగ్‌కు పాల్పడ్డ 33 మంది మిలిటెంట్లను మట్టుపెట్టామని తెలిపింది. ఈ క్రమంలో 21 మంది ప్యాసెంజర్లు, నలుగురు పాకిస్థానీ సైనికులు కన్నుమూసినట్టు పేర్కొంది.


Pakistan: పాకిస్థాన్‌లో రైలు హైజాకర్ల హతం

అయితే, బలోచ్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఈ ప్రకటనను తోసిపుచ్చింది. పాక్ సైనికులతో ఘర్షణ కొనసాగుతోందని, వైరి వర్గానికి భారీ నష్టం జరుగుతోందని పేర్కొంది. ‘‘ఆ ఆర్మీ విజయం సాధించింది గానీ బందీలను రక్షించి కానీ లేదు’’ అీని స్పష్టం చేసింది. పాక్ నుంచి బలోచిస్థాన్‌ను వేర్పాటు చేయాలని బలోచ్ లిబరేషన్ ఆర్మీ పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

Read Latest and International News

Updated Date - Mar 13 , 2025 | 09:26 PM