Taliban Ban Chess: అప్ఘానిస్థాన్‌లో చదరంగాన్ని నిషేధించిన తాలిబాన్లు
ABN , Publish Date - May 12 , 2025 | 04:58 PM
జూదానికి దారి తీస్తోందన్న కారణంతో తాలిబాన్లు చదరంగాన్ని నిషేధించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: తాలిబాన్లు అప్ఘానిస్థాన్‌లో చదరంగాన్ని నిషేధించారు. ఈ ఆట జూదానికి దారి తీస్తోందన్న కారణంతో నిషేధం విధించారు. అఫ్ఘానిస్థాన్‌లో అమలవుతున్న ఇస్లామిక్ చట్టాల ప్రకారం జూదం నిషిద్ధం. చదరంగంపై నిషేధం విధిస్తున్నట్టు తాలిబాన్ ప్రభుత్వానికి చెందిన స్పోర్ట్స్ డైరెక్టరేట్ ప్రకటించింది. ‘‘షరియా చట్టం ప్రకారం.. జూదానికి చదరంగం కూడా ఒక మార్గం’’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మతపరమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పప్టం చేశాయి. ఈ సమస్యను పరిష్కరించే వరకూ చదరంగంపై నిషేధం కొనసాగుతుందని అన్నాయి.
నిషేధంతో స్థానికులపై ప్రభావం
ముస్లిం దేశాల్లో అనేకం చదరంగాన్ని అనుమతిస్తున్నాయిన స్థానిక కాఫీ షాప్ నిర్వాహకుడు ఒకరు తెలిపారు. తన కాఫీ షాఫ్ వేదికగా నిత్యం చిన్న చిన్న పోటీలు నిర్వహిస్తుంటానని, కానీ ఇవేవీ జూదాల, పందెం కాయడం వంటివి జరగలేదని అన్నారు. అనేక ఇస్లామిక్ దేశాలు అంతర్జాతీయ చదరంగం పోటీల్లో కూడా పాల్గొంటుంటాయని తెలిపాడు. ఈ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని, అయితే, నిషేధంతో తన కాఫీ షాపు వ్యాపారంపై కూడా ప్రభావం పడుతుందని చెప్పుకొచ్చాడు.
‘‘యువతకు ఇక్కడ పెద్ద వ్యాపాకాలు ఏమీ లేవు. దీంతో చాలా మంది నా షాపునకు వచ్చి వెళుతుంటారు. కాఫీనో టీనో తాగాక తమ ఫ్రెండ్స్‌తో చదరంగం ఆడేవారు’’ అని అతడు చెప్పుకొచ్చారు. తాలిబాన్లు ఇతర ఆటలపై కూడా గతంలో ఆంక్షలు విధించారు. మహిళలు ఏరకమైన క్రీడల్లో పాల్గొనకుండా పూర్తిస్థాయి నిషేధం విధించారు. గతేడాది మిక్స్డ్ మార్షియల్ ఆర్ట్స్‌పై కూడా నిషేధం విధించారు. షరియా చట్టాల ప్రకారం ఈ క్రీడలో హింస ఎక్కవగా ఉందని చెప్పుకొచ్చారు.
Also Read:
పీఓకేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సక్సెస్
భారత్-పాక్ చర్చలు సాయంత్రానికి వాయిదా
రూ.3.5 లక్షలతో.. మీ కోటి రూపాయల కల ఇలా నిజం..
For More International News and Telugu News