Share News

Russian Dream Teacher: విద్యార్థితో అసభ్య ప్రవర్తన.. అలాంటి ఫొటోలు పంపి..

ABN , Publish Date - May 18 , 2025 | 01:39 PM

Russian Dream Teacher: కొన్ని సార్లు అతడి ఫోన్‌కు తన పర్సనల్ ఫొటోలు పంపేది. బాలుడ్ని కూడా ఫొటోలు పంపమని అడిగేది. ఇద్దరి మధ్యా అసభ్యకరమైన చాటింగ్ నడిచింది. ఓ రోజు ఈ మెసెజ్లు, ఫొటోలను బాలుడి తల్లి చూసి షాక్ అయింది.

Russian Dream Teacher: విద్యార్థితో అసభ్య ప్రవర్తన.. అలాంటి ఫొటోలు పంపి..
Russian Dream Teacher

ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనవి ఏవైనా ఉన్నాయి అంటే.. అవి కచ్చితంగా మనిషి చేసే చెడు ఆలోచనలే. చెడు ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోకపోతే అవి మన జీవితాన్నే నాశనం చేస్తాయి. ఇందుకు రష్యాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలి జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. ఆమె తను ఉన్నతమైన స్థితిలో ఉన్నానని మర్చిపోయింది. విద్యాబుద్ధులు నేర్పించి సక్రమమార్గంలో పెట్టాల్సిన విద్యార్ధితో తప్పుగా ప్రవర్తించింది. బాలుడితో తన కోర్కెలు తీర్చుకోవడానికి ప్రయత్నించింది. చివరకు విషయం బయటపడి భారీ మూల్యం చెల్లించుకుంది.


ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన 27 ఏళ్ల ఆనా ప్లాస్యుక్ ఓ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. ఆమెకు పెళ్లై భర్త ఉన్నా కూడా స్కూల్లోని 11 ఏళ్ల బాలుడిపై కన్నేసింది. పిల్లాడిని భయపెట్టి ముద్దులు పెట్టుకునేది. అతడిని కూడా అసభ్యంగా తాకేది. కొన్ని సార్లు అతడి ఫోన్‌కు తన పర్సనల్ ఫొటోలు పంపేది. బాలుడ్ని కూడా ఫొటోలు పంపమని అడిగేది. ఇద్దరి మధ్యా అసభ్యకరమైన చాటింగ్ నడిచింది. ఓ రోజు ఈ మెసెజ్లు, ఫొటోలను బాలుడి తల్లి చూసి షాక్ అయింది. ఆ టీచర్ గురించి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది.


ఆ తర్వాత ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆనాను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ పిల్లాడు తనను తరచుగా పొగుడుతూ ఉండేవాడని, తన గురించి ఎక్కువ శ్రద్ధ చూపించే వాడని ఆనా పోలీసులకు తెలిపింది. అయితే, ఆనా బాలుడితో తప్పుగా ప్రవర్తించిందని తేలటంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తాజాగా కోర్టు ఆనా కేసుపై తుది తీర్పును ఇచ్చింది. ఆనాకు 9 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 10 సంవత్సరాల పాటు ఆనా చదువు చెప్పడానికి వీలు లేదని కోర్టు ఆదేశించింది.


ఇవి కూడా చదవండి

Fire Accident In Charminar: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. ఇలా జరిగింది..

Rukmini Vijayakumar: ప్రముఖ నటి కారులో చోరీ.. ఏకంగా 23 లక్షల సొత్తు దోచేశాడు..

Updated Date - May 18 , 2025 | 01:44 PM