Pakistan: ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ బుద్ధి మారటం లేదు..
ABN , Publish Date - Jun 10 , 2025 | 09:16 AM
Pakistan: ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు, ఇస్లామిక్ డెవలప్‌మెంట్ బ్యాంకులకు 38.8 బిలియన్ డాలర్లు ఇవ్వాలి. చైనా బ్యాంకుకు 25 బిలియన్ డాలర్లు.. యూరోబాండ్స్, సుకుక్స్‌లనుంచి 7.8బిలియన్ డాలర్లు తీసుకుంది.

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త అప్పులు దొరికితే కానీ, ప్రభుత్వం నడవలేని పరిస్థితి. ఒక వేళ అప్పులు దొరికితే ప్రజల కోసం, దేశాభివృద్ధి కోసం ఖర్చు చేస్తారా అంటే.. అదీ లేదు. ప్రపంచ బ్యాంకు నుంచో.. ఇతర దేశాల నుంచో తెచ్చుకున్న అప్పుల్లో ఎక్కువ భాగాన్ని.. మిలటరీ కోసం.. టెర్రరిస్టులను పెంచి పోషించడం కోసం పాక్ వాడుతోంది. దీంతో ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బ తింటోంది. దేశ ప్రజలు రోజు రోజుకు పేదరికంలో కూరుకుపోతున్నారు.
ఓ వైపు భారత దేశంలో పేదరికం తగ్గుతూ ఉంటే.. మరో వైపు పాకిస్తాన్‌లో పేదరికం పెరుగుతోంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. 2017 సంవత్సరానికంటే ముందు పాకిస్తాన్‌లో తీవ్ర పేదరికం రేటు 4.9 శాతంగా ఉండేది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి అది 16.5 శాతానికి పెరిగింది. ఐదేళ్లలో 12 శాతం పెరుగుదల అంటే .. అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఊహించవచ్చు. ఇక, పాకిస్తాన్ మొత్తం అప్పుల మీదే నడుస్తోంది. పాక్‌కు ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ఇంటర్‌నేషనల్ మానిటర్ ఫండ్‌కు ఏకంగా 44.7 బిలియన్ డాలర్లు ఇవ్వాలి.
ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు, ఇస్లామిక్ డెవలప్‌మెంట్ బ్యాంకులకు 38.8 బిలియన్ డాలర్లు ఇవ్వాలి. చైనా బ్యాంకుకు 25 బిలియన్ డాలర్లు.. యూరోబాండ్స్, సుకుక్స్‌లనుంచి 7.8బిలియన్ డాలర్లు తీసుకుంది. సౌదీ అరేబియా, యూఏఈ, పారిస్ క్లబ్‌లకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలి. ఈ అప్పుల్ని తీర్చే స్థోమత పాక్‌కు లేదు. ఆ విషయం అప్పు ఇచ్చిన వారికి కూడా తెలుసు. ఇప్పుడు కొత్త అప్పు కోసం పాక్ ఎదురు చూస్తోంది. పాక్ తీసుకున్న అప్పు తీర్చలేదని తెలిసినా.. ఇవ్వడానికి కొన్ని సంస్థలు సిద్ధంగా ఉండటం గమనార్హం.
ఇవి కూడా చదవండి
11 ఏళ్లలో ఎంత మార్పు.. దేశంలో భారీగా తగ్గిన పేదరికం ...
అమ్మాయని కూడా చూల్లేదు.. మరీ దారుణంగా..