Share News

Dmitry Medvedev: ఇరాన్‌కు అణ్వాయుధాలు ఇచ్చేందుకు చాలా దేశాలు రెడీ.. రష్యా మాజీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 22 , 2025 | 09:38 PM

ఇరాన్ ప్రజలు ఇప్పుడు నిరంతర ముప్పు భయంలో ఉన్నారని, దేశంలోని అనేక చోట్ల పేలుళ్లు జరుగుతున్నాయని డిమిత్రి మెద్వెదేవ్ చెప్పారు. దాడుల వల్ల రాజకీయంగా ఇరాన్ బలపడుతుందన్నారు. ఇరాన్ రాజకీయ వ్యవస్థకు ఇబ్బందేమీ లేదని చెప్పారు.

Dmitry Medvedev: ఇరాన్‌కు అణ్వాయుధాలు ఇచ్చేందుకు చాలా దేశాలు రెడీ.. రష్యా మాజీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
Dmitry Medvedev

మాస్కో: ఇరాన్‌లోని ఫోర్డో, నాటాంజ్, ఇస్ఫహాన్‌ అణు కేంద్రాలపై ఆదివావారం తెల్లవారుజామున అమెరికా బీ-2 బాంబర్లపై దాడి చేయడంపై రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ డిమిత్రి మెద్వెదేవ్ (Dmirty Medvedev) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతిని ప్రకటిస్తూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ అమెరికాను మధ్యప్రాశ్చంలో యుద్ధంలోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. ఇరాన్‌పై దాడిలో అక్కడ పెద్దగా నష్టమేమీ జరగలేదని, అమెరికా సైనిక లక్ష్యం విఫలమైందని చెప్పారు.


'ఇరాన్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్‌‌కు చెందిన క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఎలాంటి నష్టం జరిగినట్టు కనిపించడం లేదు. డ్యామేజ్ చాలా స్పల్పంగానే ఉంది. అణు పదార్ధాల సుసంపన్నత, భవిష్యత్తులో అణ్వాయుధాల తయారీ కొనసాగుతుందని ఇప్పుడు మనం బహిరంగంగా చెప్పగలం' అని మెద్వెదేవ్ పేర్కొన్నారు.


చాలా దేశాలు రెడీగా ఉన్నాయి

ఇరాన్‌కు నేరుగా తమ న్యూక్లియర్ వార్‌హెడ్‌లను సరఫరా చేసేందుకు అనేక దేశాలు సిద్ధంగా ఉన్నాయని మెద్వెదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ దేశాల పేర్లను ఆయన చెప్పలేదు. ఇరాన్ ప్రజలు ఇప్పుడు నిరంతర ముప్పు భయంలో ఉన్నారని, దేశంలోని అనేక చోట్ల పేలుళ్లు జరుగుతున్నాయని చెప్పారు. దాడుల వల్ల రాజకీయంగా ఇరాన్ బలపడుతుందన్నారు. ఇరాన్ రాజకీయ వ్యవస్థకు ఇబ్బందేమీ లేదని, మరింత బలపడే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఇంతకుముందు పాలనా వ్యవస్థతో విభేదించిన వారితో సహా ప్రజలు దేశ ఆధ్యాత్మిక నాయకత్వం వైపు మొగ్గుచూపనున్నారని అన్నారు.


పుతిన్‌ను కలుసుకోనున్న ఇరాన్ విదేశాంగ మంత్రి

కాగా, ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడుల నేపథ్యంలో తాను మాస్కో వెళ్తున్నట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఆదివారంనాడు ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్‌తో ఉన్నత స్థాయి సమావేశం జరుపనున్నట్టు చెప్పారు. ఇస్తాంబుల్‌లో ఓఐసీ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అరాగ్చి.. సోమవారం ఉదయం పుతిన్‌ను కలుస్తామని తెలిపారు. ఇరాక్‌కు రష్యా మిత్రుడని, తాము ఒకరితో ఒకరు ఎప్పుడూ సంప్రదించుకుంటూనే ఉంటామని చెప్పారు. పుతిన్‌తో సీరియస్ చర్చలు జరపనున్నట్టు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

యూఎస్ దాడులు.. ఇరాన్ కీలక నిర్ణయం..

ఇరాన్‌పై అమెరికా దాడి.. తీవ్రంగా ఖండించిన పాక్..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 09:52 PM