Share News

కరెంటు లేక స్తంభించిన యూరప్‌

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:48 AM

యూరప్‌లోని స్పెయిన్‌, పోర్చుగల్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో తీవ్రమైన విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిని, విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కరెంటు లేక స్తంభించిన యూరప్‌

బార్సెలొనా, ఏప్రిల్‌ 28: యూర్‌పలోని స్పెయిన్‌, పోర్చుగల్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం పన్నెండున్నరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో సబ్‌ వే నెట్‌వర్క్‌లు, మెట్రో స్టేషన్లు, ఫోన్‌ లైన్లు, ట్రాఫిక్‌ లైట్లు, ఏటీఎం మిషన్లు పనిచేయడం లేదు. ట్రాఫిక్‌ లైట్లు పనిచేయకపోవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మొబైల్‌ ఫోన్‌ నెట్‌వర్క్స్‌ పనిచేయకపోవడంతో వాయిస్‌ కాల్స్‌కు అవకాశం లేకుండా పోయింది. ఎలకా్ట్రనిక్‌ పేమెంట్‌ సేవలు నిలిచిపోయాయి. రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విమానాశ్రయాల్లో కూడా సేవలు నిలిచిపోయాయి. వీటితో పాటు అనేక సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యూరోపియన్‌ విద్యుత్‌ గ్రిడ్‌లో సమస్య తలెత్తిందని, విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు యత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

For National News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 04:48 AM