Erases DNA Traces: కిమ్‌తో మామూలుగా ఉండదు.. డీఎన్ఏ ఆనవాళ్లు కూడా దొరక్కుండా..
ABN , Publish Date - Sep 04 , 2025 | 06:51 AM
పుతిన్ కూడా ఇలాంటి ప్రోటోకాల్‌నే ఫాలో అవుతున్నారు. పుతిన్ డీఎన్ఏను ఎవరూ దొంగలించకుండా ఉండేందుకు.. ఆయన ఎక్కడికి వెళ్లినా మూత్రాన్ని, మలాన్ని సేకరిస్తున్నారు.
చైనాలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పర్యటించారు. బీజింగ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం అయ్యారు. సమావేశం సానుకూలంగా ముగిసినట్లు తెలుస్తోంది. ఇద్దరు నాయకులు పలు ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. మీటింగ్ తర్వాత ఇద్దరూ టీ తాగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే కిమ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది రంగంలోకి దిగింది. కిమ్ కూర్చున్న, తాకిన ప్రదేశాలను క్లీన్ చేసింది. తాగిన టీ కప్పును కూడా తీసుకెళ్లిపోయింది.
కిమ్ కూర్చున్న, తాకిన ప్రదేశాలను క్లీన్ చేయడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. వాటిపై కిమ్ డీఎన్ఏ ఆనవాళ్లు లేకుండా చేయడానికి శుభ్రం చేసినట్లు సమాచారం. అయితే, డీఎన్‌ఏ ఆనవాళ్లు కూడా దొరక్కుండా ఫోరెన్సిక్ లెవెల్ భద్రత ఎందుకు తీసుకుంటున్నారన్నది తెలియరాలేదు. రష్యా సెక్యూరిటీ సర్వీసులు, చైనా సర్వేలెన్స్‌కు భయపడి కిమ్ ఈ స్థాయిలో భద్రత తీసుకుంటున్నారని అనలిస్ట్‌లు అభిప్రాయ పడుతున్నారు.
ఇంచుమించు పుతిన్ కూడా ఇలాంటి ప్రోటోకాల్‌నే ఫాలో అవుతున్నారు. పుతిన్ డీఎన్ఏను ఎవరూ దొంగలించకుండా ఉండేందుకు.. ఆయన ఎక్కడికి వెళ్లినా మూత్రాన్ని, మలాన్ని సేకరిస్తున్నారు. ఇది 2017 నుంచి జరుగుతూ ఉంది. కొద్దిరోజుల క్రితం అమెరికాకు పుతిన్ వెళ్లారు. అలాస్కాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. పుతిన్ అమెరికాలో ఉన్నంత వరకు ఆయన మూత్రాన్ని, మలాన్ని సేకరించారు. వాటిని సూట్‌కేసులో దాచి తీసుకెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి
నేటి రాత్రి 12 గంటల వరకే దర్శనాలు..
రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..