Jeff Bezos: వెనిస్‌లో అమెజాన్ అధిపతి భారీ వివాహం.. ఖర్చు ఎంతైందో తెలుసా?
ABN , Publish Date - Jun 29 , 2025 | 08:25 AM
జెఫ్ బెజోస్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ భారీ వివాహంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినా జెఫ్ బెజోస్ మాత్రం వెనకడుగు వేయలేదు. వెనిస్‌లోని లాగూన్ ఐలాండ్‌లో వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి భారీగా ఖర్చు అయినట్టు సమాచారం.

అమెజాన్ (Amazon) సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ (Jeff Bezos) 61 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకున్నారు. తన ప్రియురాలు, 55 ఏళ్ల లారెన్ శాంచెజ్ (Lauren Sanchez)ను ఇటలీలోని వెనిస్ (Venice)లో పెళ్లాడారు. ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ భారీ వివాహంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినా జెఫ్ బెజోస్ మాత్రం వెనకడుగు వేయలేదు. వెనిస్‌లోని లాగూన్ ఐలాండ్‌లో వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి భారీగా ఖర్చు అయినట్టు సమాచారం.
పెళ్లికి వచ్చే అతిథుల కోసం వెనిస్‌లో లగ్జరీ హోటల్ అమన్ వెనిస్ (Aman Venice)ను బుక్ చేశారు. ఈ హోటల్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ వివాహం కోసం జెఫ్ బెజోస్ ఏకంగా 55 మిలియన్ డాలర్లు (రూ.548 కోట్లు) ఖర్చుపెట్టినట్టు సమాచారం. యూరప్‌లో ఇంత భారీ వెడ్డింగ్ ఇదే అని తెలుస్తోంది. ఎంగేజ్‌మెంట్ సందర్భంగా బెజోస్ తన ప్రియురాలికి 2.5 మిలియన్ డాలర్ల విలువైన డైమండ్ రింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. కాగా, ఈ వివాహానికి 200 మందికి పైగా అతిథులు హాజరైనట్టు తెలుస్తోంది.
ఈ భారీ వివాహానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్‌ఫ్రే, కిమ్ కర్దేషియాన్, కోలే కర్దేషియాన్, జోర్డాన్ రాణి రనియా తదితరులు హాజరయ్యారు. కాగా, వివాహం అనంతరం ఫొటోలను లారెన్ శాంచెజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన పేరును లారెన్ శాంచెజ్ బెజోస్‌గా మార్చుకున్నారు.
ఇవీ చదవండి:
కెనడాపై ట్రంప్ ఆగ్రహం.. వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు ప్రకటన
ట్రంప్ వీసా ఆంక్షలతో వైద్య సిబ్బంది కొరత.. అందోళనలో అమెరికా ఆసుపత్రులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి