Share News

Italy Cable Car Crash: ఇటలీలో కూలిన కేబుల్ కార్.. నలుగురు దుర్మరణం

ABN , Publish Date - Apr 18 , 2025 | 06:54 PM

తీగలపై వెళ్లే కేబుల్ కార్ ప్రమాదవశాత్తూ కింద పడటంతో నలుగురు దుర్మరణం చెందారు. మార్గమధ్యంలో ఇరుక్కుపోయిన మరో రెండు కేబుల్‌కార్‌లోని వారిని అత్యవసర సిబ్బంది కాపాడారు. ఇటలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Italy Cable Car Crash: ఇటలీలో కూలిన కేబుల్ కార్.. నలుగురు దుర్మరణం
Italy Cable Car Crash

తీగలపై వెళ్లే కేబుల్ కార్ ప్రమాదవశాత్తూ కింద పడటంతో నలుగురు మృతి చెందిన షాకింగ్ ఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మరో వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటలీలోని నేపల్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాస్టల్లామేరీ స్టీబియా నుంచి మౌంట్ ఫాటియో మధ్య ఎత్తున ఏర్పాటు చేసిన ఇనుప తీగులు తెగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో తీగలకు వేళాడుతున్న కారు (కేబిన్) కింద పడటంతో నలుగురు దుర్మరణం చెందారు. ఘటనలో గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.


ఈ ఘటన కారణంగా అదే మార్గంలో వెళుతున్న మరో రెండు కేబుల్ కార్స్ కూడా మార్గమధ్యంలో నిలిచిపోయాయి. ఒక కేబుల్ కారులో సుమారు 16 మంది ఉండగా వారిని అత్యవసర సిబ్బంది తాళ్ల సాయంతో కిందకు దింపారు. పొగ మంచు కారణంగా రెండో కేబుల్ కార్ వద్ద సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఘటనపై దర్యాప్తు ప్రారంభించాని స్థానిక అధికారులు తెలిపారు. ఎండాకాలం కావడంతో టూరిస్టుల కోసం ఇటీవలే కేబుల్ కార్ జర్నీ పునఃప్రారంభమైందని అన్నారు.


ప్రస్తుతం అమెరికాలో పర్యటనలో ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. 1952 నుంచి కేబుల్ కార్ సేవలు నిర్వహిస్తున్నారు. ఇక 1960లో జరిగిన ఇదే తరహా ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇక 1998లో చోటుచేసుకున్న కేబుల్ క్రాష్ యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. తక్కువ ఎత్తున ప్రయాణిస్తున్న ఓ యుద్ధ విమానం రెక్కలు తగలడంతో తీగలు తెగి కేబుల్ కారు కూలిపోయింది. డోలొమైట్స్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కారులోని 20 మంది దుర్మరణం చెందారు. ఇక 2021లో జరిగిన కేబుల్ క్రాష్‌లో 14 మంది దుర్మరణం చెందారు.

ఇవి కూడా చదవండి:

Chhattisgarh: లొంగిపోయిన 33 మంది నక్సల్స్

బెంగాల్ ఘటనలపై బంగ్లా అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన భారత్

ఎలాన్ మస్క్‌తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ

Read Latest and National News

Updated Date - Apr 18 , 2025 | 06:55 PM