Share News

Operation Rising Lion: ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్.. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:56 PM

Operation Rising Lion: ఇరాన్ న్యూక్లియర్ బాంబు ఆశలపై ఇజ్రాయెల్ నీళ్లు చల్లడానికి చూస్తోంది. ఇరాన్ దగ్గర ఒక్క అణు బాంబు కూడా లేదు. చాలా ఏళ్ల నుంచి అణు బాంబును తయారు చేయాలని శ్రమిస్తోంది.

Operation Rising Lion: ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్.. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు
Operation Rising Lion

ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం నాడు ఇరాన్ భూభాగంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఈ దాడులు చేసింది. హై వాల్యూ న్యూక్లియర్ సైట్లు, మిలటరీ బేస్‌లను టార్గెట్ చేసుకుని దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడులు చేసిన న్యూక్లియర్ సైట్లలో ఎంతో కీలకమైన నటంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో మేజర్ జనరల్ హొస్సైన్ సలామీ చనిపోయారు. ఈ విషయాన్ని ఇరాన్ దేశ అధికారిక మీడియా స్వయంగా వెల్లడించింది.


పదేళ్ల తర్వాత మళ్లీ..

పదేళ్ల క్రితం ఇరాన్ న్యూక్లియర్ సిస్టమ్‌ను దెబ్బ తీయడానికి ఓ సైబర్ అటాక్ జరిగింది. ఇరాన్ న్యూక్లియర్ సిస్టమ్‌లోని ‘సూపర్ వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విషన్’ను టార్గెట్ చేస్తూ ‘స్టక్స్‌నెట్’ అని పిలువబడే ఓ మాల్‌వేర్‌ ప్రయోగం జరిగింది. దీని కారణంగా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ భారీగా దెబ్బతింది. అయితే, ఈ దాడులు చేసింది ఎవరో ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ ఈ దాడులకు పాల్పడింది మేమే అని స్వయంగా ప్రకటించలేదు.


స్టక్స్‌నెట్ సైబర్ అటాక్ జరిగిన 15 సంవత్సరాలకు.. అది కూడా అదే నెలలో.. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడుల్లో కీలకమైన నటంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఇరాన్ న్యూక్లియర్ బాంబు ఆశలపై ఇజ్రాయెల్ నీళ్లు చల్లడానికి చూస్తోంది. ఇరాన్ దగ్గర ఒక్క అణు బాంబూ లేదు. చాలా ఏళ్ల నుంచి అణు బాంబును తయారు చేయాలని శ్రమిస్తోంది.


అణు బాంబు తయారీకి అవసరమైన ఎన్‌రిచ్డ్ యురేనియమ్ 60 శాతం వరకు ఉంది. అది కాస్తా 90 శాతానికి చేరితే.. నాలుగు అణు బాంబులు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇరాన్ అణు బాంబులు తయారు చేసుకుంటే తమకు ఇబ్బంది అవుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఇరాన్ న్యూక్లియర్ ప్రయోగాలను అడ్డుకోవడానికి చూస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఇరాన్‌లోని న్యూక్లియర్ సైట్లపై దాడులు చేసింది.


ఇవి కూడా చదవండి

అద్భుతం.. అంత పెద్ద ప్రమాదంలోనూ భగవద్గీతకు ఏమీ కాలేదు..

ఉదయం పేపర్లో యాడ్.. మధ్యాహ్నం విమాన ప్రమాదం..

Updated Date - Jun 13 , 2025 | 03:45 PM