Israels Intelligence: ఇజ్రాయెల్ కీలక నిర్ణయం.. ఇకపై సైనికులకు అరబిక్, ఇస్లామిక్ చదువులు
ABN , Publish Date - Jul 26 , 2025 | 08:40 PM
Israels Intelligence: ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సైనికుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమానికి డిఫెన్స్ ఫోర్స్ శ్రీకారం చుట్టింది.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కీలక నిర్ణయం తీసుకుంది. సైనికులు, ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేసే అధికారులు అరబిక్ భాష, ఇస్లామిక్ విద్యను నేర్చుకోవటం తప్పనిసరి చేసింది. ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక ఓ పెద్ద కారణమే ఉంది. జెరుసలేమ్ పోస్ట్ ప్రకారం.. 2023, అక్టోబర్ 7వ తేదీన ఇంటెలిజెన్స్ విభాగం ఫెయిల్ అయింది. ఇరాన్‌కు సంబంధించిన విషయాలను స్పష్టంగా తెలుసుకోలేకపోయింది. దేశ భద్రతకు శత్రుదేశం భాష, సంప్రదాయాలు అడ్డుకాకూడదని అమన్ చీఫ్, మేజర్ జనరల్ స్లోమీ బిండర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా హౌతీ, ఇరాకీ మాండలికాలపైనా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు హౌతీ మాండలికంలో మాట్లాడటానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాదు.. సైనికులు, ఇంటెలిజెన్స్ అధికారుల్లో 50 శాతం మందికి అరబిక్ భాష నేర్పించనున్నారు. ఇందులో భాగంగా ఖత్‌ను వాడనున్నారు. ఖత్ అనేది ఒకరకమైన మత్తు కలిగించే మొక్క. యెమెన్, అరబ్‌లోని ఇతర ప్రాంతాల్లో దీన్ని తింటూ ఉంటారు. దీని కారణంగా వారి మాటల్లో స్పష్టత లోపిస్తుంది. సైనికులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఖత్ తీసుకోవటం వల్ల వారి మాటలు కూడా అరబ్ దేశస్తుల్లాగా వినిపిస్తాయి.
ఇక, సీనియర్ అమన్ ఆఫీసర్ ఆర్మీ రేడియోలో మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ సంప్రదాయం, భాష, ఇస్లాంల విషయంలో మనం పట్టు సాధించలేకపోయాం. మనం ఆ విషయాల్లో ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము మన సైనికులను, ఇంటెలిజెన్స్ అధికారులను అరబ్ దేశపు పిల్లల్లా మార్చటం లేదు. కానీ, మనం వారి భాష, సాంప్రదాయాల్ని నేర్చుకుని వారినే ఆశ్చర్యపరిచే విధంగా మారాలి’ అని అన్నారు. ఇక, అరబిక్ భాష, ఇస్లామిక్ విద్యను నేర్పించడానికి ఓ డిపార్ట్‌మెంట్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
నీట మునిగిన మహా నగరం.. 20 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి
కింగ్‌డమ్ మూవీకి తిప్పలు.. తిరుపతిలో నిరసన సెగ