Share News

Canada: కెనడాలో భారత విద్యార్థిని అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:27 AM

కెనడాలోని ఒట్టావాలో భారతీయ విద్యార్థిని వన్షిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 21 ఏళ్ల వన్షిక గత శుక్రవారం రాత్రి ఆపధిని వెతకడానికి వెళ్ళి, తిరిగి రాలేదు, తరువాత ఆమె మృతదేహం ఒంటారియో ప్రావిన్స్‌లో లభ్యమైంది.

Canada: కెనడాలో భారత విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఒట్టావా, ఏప్రిల్‌ 29: కెనడాలోని ఒట్టావాలో భారతీయ విద్యార్థిని వన్షిక (21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయాన్ని ఆ దేశంలోని భారత హైక మిషన్‌ ధ్రువీకరించింది. పంజాబ్‌కు చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత దేవిందర్‌ సైనీ కుమార్తె వన్షిక రెండేళ్ల క్రితం డిప్లొమా కోర్సు చేయడానికి కెనడా వెళ్లింది. గత శుక్రవారం రాత్రి అద్దె ఇంటిని వెతికేందుకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఆదేరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆమె ఫోను స్విచ్‌ ఆఫ్‌ అయింది. దీంతో ఆందోళన చెందిన సన్నిహితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు మూడు రోజులుగా వన్షిక కోసం తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలోనే ఒంటారియో ప్రావిన్స్‌ వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది.


ఇవి కూడా చదవండి..

Pakistan: భారత 'గూఢచారి డ్రోన్‌'ను కూల్చేశామన్న పాక్

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

Viral News: పాకిస్తాన్‎ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..

Updated Date - Apr 30 , 2025 | 05:28 AM